Vishwak Sen: తనకు బాక్గ్రౌండ్ లేదని విశ్వక్ ఆ హీరోను ఉద్దేశించే అన్నాడా.?

ఎన్నో పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య,  రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా మారాడు. తన మొదటి సినిమాతోనే విశిష్టమైన పేరును సంపాదించి అందరికంటే డిఫరెంట్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్నాడు.  ఆ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరించిన “చల్ మోహన్ రంగా” సినిమాను డైరెక్ట్ చేశాడు కృష్ణ చైతన్య.  కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.

ఆ సినిమా మ్యూజిక్ పరంగా మంచి హిట్  అయింది.  త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే, అంచనాలు భారీ స్థాయిలో పెట్టుకొని ఆడియన్స్ ఎదురు చూశారు. కానీ అవన్నీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి.  ఇక ప్రస్తుతం కృష్ణ చైతన్య చేస్తున్న సినిమా “గ్యాంగ్స్ అఫ్ గోదావరి” ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార  ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ యంగ్ హీరోస్ తో సినిమాలు చేయటంలో మంచి జోష్ ని చూపిస్తుంది.  ఇకపోతే “గ్యాంగ్స్ అఫ్ గోదావరి”  సినిమా డిసెంబర్ 8న రిలీజ్ కి సిద్ధంగా ఉందని ఇదివరకే ప్రకటించారు.  అయితే ఈ రిలీజ్ విషయంలో హీరో విశ్వక్సేన్ కి, నిర్మాతలకు మధ్య ఏదో గొడవ జరుగుతుంది   ఇంస్టాగ్రామ్ స్టోరీ వలన అర్థమవుతుంది.

- Advertisement -

విశ్వక్సేన్ తన ఇన్స్టా స్టోరీ లో మనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడు మన గేమ్ మారుద్దామని చూస్తాడు.  ఒకవేళ ఈ సినిమా కానీ డిసెంబర్ 8 అని రిలీజ్ అవ్వలేదు అంటే, మరో డేట్ కానీ మారితే.? నన్ను ఈ సినిమా ప్రోమోషన్స్  లో చూడరంటూ తన స్టోరీ తో షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. దీనిని  కొంతమంది పబ్లిసిటీ స్టంట్ అని, ఇంకొంతమంది నిజంగానే నిర్మాతలకి విశ్వక్ మధ్య ఏదో జరిగి ఉంటుంది అని అభిప్రాయ పడుతున్నారు.

బేసిక్ గా ఒక సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. సరైన టైం కి షూట్ అవ్వకపోవడం, సాంగ్స్ లేట్ అవ్వడం ఇలా చాలా ఉంటాయి. ఇంకొన్ని సందర్భాలలో ఒకేసారి ఎక్కువ సినిమాలు రిలీజ్ కి ఉండటం కారణం అవుతుంది. ఇక్కడ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి విషయానికి వస్తే , డిసెంబర్ 8న ఈ సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

అందులో నితిన్ నటించిన “ఎక్స్ట్రాడినరీ మ్యాన్” ఒకటి. నితిన్ కి , మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ కి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భీష్మ,రంగదే వంటి సినిమాలు చేసాడు నితిన్ ఆ బ్యానర్ లో, అంతే కాకుండా సితార మెయిన్ బ్యానర్ లో హారిక హాసిని లో కూడా “అ,ఆ” సినిమాను చేసాడు. ఇంకా నితిన్ కి దిల్ రాజ్ కి మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చర్చిస్తున్నామంటే “విశ్వక్సేన్ తన ఇన్స్టా స్టోరీ లో మనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడు మన గేమ్ మారుద్దామని చూస్తాడు” ఇది వాడటానికి కారణం ఏంటి , నితిన్ లా తనకు బాక్గ్రౌండ్ లేదనా అని కొందరి సందేహం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు