Icon Star: హీరోయిన్ తో ఆ పని చేయడానికి ఇబ్బందిపడ్డ అల్లు అర్జున్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది. కానీ పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకొని సత్తా చాటాడు అల్లు అర్జున్. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

అల్లు అర్జున్ విభిన్న పాత్రాభినయం, రష్మిక మందన్న అల్లు అర్జున్ కి ధీటుగా నటించడంతో సినిమాలోని ఒక్కో సీన్ ఆడియన్స్ తో అదుర్స్ అనిపించింది. ఇదంతా ఒక ఎత్తైతే చిత్రంలోని స్పెషల్ సాంగ్ ” ఊ అంటావా మామ ఊఊ అంటావా” తో సమంత కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఈ పాటతో సమంత సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా ట్యూన్ అందించడంతోపాటు చంద్రబోస్ రచించిన లిరిక్స్ చక్కగా కుదిరాయి. దీంతో సాంగ్ వినసొంపుగా ఉండడంతో ఇట్టే ప్రేక్షకులకు నచ్చేసింది.

దీనికి తోడు సమంత స్పెషల్ అపీరియన్స్ అభిమానులకు తెగ నచ్చేసింది. అయితే సమంతతో నటించిన ఐటమ్ సాంగ్ లో ఓ సన్నివేశంలో నటించమంటే అల్లు అర్జున్ మొండి చేశారట. ఈ పాటలోని ఓ సందర్భంలో సమంత నడుము గిల్లే చిన్న సన్నివేశం ఉండడంతో ఈ సన్నివేశం చేయనంటూ అల్లు అర్జున్ మొండికేశారట. సుకుమార్ ఎంత బ్రతిమాలినప్పటికీ అల్లు అర్జున్ చేయనని అన్నారట. ఆ తరువాత సమంత కూడా ఇదంతా కేవలం సినిమాలో ఓ భాగమే కదా అంటూ ధైర్యం చెప్పడం, చివరికి సుకుమార్ సీరియస్ కావడంతో నడుము గిల్లినట్లుగా ఆక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ సన్నివేశాన్ని విజువల్స్ లో గెలుతున్నట్లుగా చూపించారట సుకుమార్. అయితే ఇదంతా కేవలం స్నేహ రెడ్డి భయంతోనే జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు