Raviteja: టైగర్ ఆరోజునే వచ్చుంటే మరోలా ఉండేది?

టాలీవుడ్ లో ఈ దసరా కి రిలీజ్ అయిన సినిమాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. అక్టోబర్ 20న భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ వరకు బాగానే వచ్చినా ఆ తరువాత టైగర్ తన జోరుని చూపలేకపోయాడు. అయితే టైగర్ నాగేశ్వరరావు దసరా రేసులో ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే ఆడియన్స్ రిజెక్ట్ చేసినంత మాత్రాన ఈ సినిమాలో మ్యాటర్ లేదని కాదు.

టైగర్ నాగేశ్వరరావు ఆక్షన్ సినిమా కావడం, అందులోనూ నరుకుడు కాన్సెప్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. అది గాక ఒక బయోపిక్ సినిమాకి ఫిక్షనల్ స్టోరీ ఎక్కువగా యాడ్ చేయడంతో ల్యాగ్ కూడా ఎక్కువైందని ఎక్కువగా పట్టించుకోలేదు.

ఇదిలా ఉండగా టైగర్ నాగేశ్వరరావు సలార్ సెప్టెంబర్ నుండి తప్పుకోవడంతో ఆ డేట్ లో టైగర్ నాగేశ్వరరావు వస్తాడని అందరూ అనుకున్నారు. నిజానికి అప్పుడే పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. అందుకే సెప్టెంబర్ 28న టైం కి టైగర్ నాగేశ్వరావు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. లాంగ్ రన్ స్కోప్ లేకపోయినా కనీసం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని బ్రేక్ ఈవెన్ అయ్యేది.

- Advertisement -

ఇక రవితేజ కూడా సినిమా వరకు తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఏది ఏమైనా టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ టైమింగ్ సరిగా లేకే ప్లాప్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక దసరా సినిమాల్లో భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా రాగా, లియో వారం లోపే లాభాల్లోకి ఎంటర్ అయ్యి దసరా విన్నర్ గా నిలిచింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు