పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి వరుస హిట్స్ అందుకున్న తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్ భాస్కర్ తాజాగా కీడా కోలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకోవటంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ కి ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్స్ తో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా.
Read More: Keedaa Cola Movie Review: టాక్ ఎలా ఉందంటే..!
లో బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి ముందు నుండే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వటంతో మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ, 8.5 నుండి 9కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంటే, కీడా కోలా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 9కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టాలి.
యూఎస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వటం పెద్ద విషయం ఏమీ కాదనే చెప్పాలి. సినిమా కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా తరుణ్ తనదైన స్టైల్ యూనిక్ గా డీల్ చేశాడు ఈ సినిమాను. బ్రహ్మానందం ని డిఫరెంట్ రోల్ లో చూపించి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.
Read More: Keedaa Cola: కీడా కోలా ఏ ఓటీటీలో అంటే..!
బ్రహ్మానందం మినహా స్టార్ క్యాస్ట్ లేని ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ ఒక్కడే క్రౌడ్ పుల్లర్ అని చెప్పాలి. డైరెక్షన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో కూడా నటించాడు తరుణ్ భాస్కర్. తరుణ్ క్యారెక్టర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని టాక్ వినిపిస్తోంది. మరి, డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఎంత స్పీడ్ గా టార్గెట్ రీచ్ అవుతుందో అన్నది వేచి చూడాలి.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.