Global Star: వైరల్ అవుతున్న రామ్ చరణ్ కాస్ట్లీ వాచ్.. ధర ఎంతంటే?

గ్లోబల్ స్టార్ గా టాలీవుడ్ ని ఏలుతున్న రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరో గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులని మెప్పించి ఇండస్ట్రీ లోనే టాప్ హీరోగా ఎదిగాడు. అయితే చూడ్డానికి ఎంతో సింపుల్ గా డ్రెస్సింగ్ తో ఆకట్టుకునే రామ్ చరణ్, తాను వాడే లగ్జరీ వస్తువుల్లో మాత్రం తన రేంజ్ చూపిస్తాడు.

కార్ల దగ్గరి నుండి వేసుకునే చెప్పుల దాకా సింపుల్ గానే కనిపించినా వాటి రేంజ్ ఓ స్థాయిలో ఉంటుంది. ఇక రామ్ చరణ్ కి వాచ్ ల పిచ్చి కూడా చాలా ఉంటుందని తెలిసిందే.

గత రెండు నెలల కిందట క్లిమ్ కారా నామకరణం రోజు రిచర్డ్ మిల్లె కంపెనీకి కి చెందిన ఒక కాస్ట్లీ వాచ్ ని పెట్టుకుని సందడి చేయగా, ఆ వాచ్ 1కోటి 62 లక్షలు అని తెలిసింది.

- Advertisement -

కాగా లేటెస్ట్ గా వరుణ్ లావణ్య పెళ్ళిలో పెట్టుకున్న వాచ్ అంతకంటే గ్రాండియర్ గా ఉంది. అయితే మన ఫ్యాన్స్ గురించి తెలిసిందే గా. హీరో వేసుకున్న షర్ట్ ఖరీదే నిమిషాల్లో కనిపెట్టి చెప్పేస్తారు. అలాంటిది తమకిష్టమైన హీరోల లగ్జరీ వస్తువుల గురించి కనుకోలేరా? లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం గోల్డ్ పూత వేసిన ఆ వాచ్ మోడల్ పేరు “patek philippe 5990/1R-001 nautilus” వాచ్ అని తెలిసింది.

ఇక దాని ఖరీదు అక్షరాలా 2,85,000 డాలర్లు. అంటే ఇండియా కరెన్సీ లో దాదాపు 2 కోట్ల 37లక్షల రూపాయలు. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో రామ్ చరణ్ దగ్గర ఉన్నంత కాస్ట్లీ వాచెస్ మరే హీరో దగ్గర లేవని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

For More Updates :Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు