Biggboss season7: ఎలిమినేట్ అయిన తేజ! ఊహించలేదు!

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఈ వారం లో జరిగిన టాస్క్ లలో శోభా శెట్టి కెప్టెన్ అయింది. అయితే నామినేషన్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ పోరాడగా, ఈ కంటెస్టెంట్స్ లలో శివాజీ, యావర్, అర్జున్, ప్రియాంక లాంటి వాళ్ళు ఎలాగో సేవ్ అవుతారని తెలుసు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఎక్కువ శాతం అశ్విని శ్రీ, భోలే ల మధ్యే ఉంటుందని అనుకున్నారు. శోభా ఎలాగో కెప్టెన్ అయ్యింది కాబట్టి ఆడియన్స్ సపోర్ట్ పెరగడంతో పాటు ఇమ్మ్యూనిటి కూడా వచ్చింది.

కానీ ఆడియన్స్ అందరి అంచనాలని తల కిందులు చేస్తూ ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. అయితే వచ్చిన సమాచారం ప్రకారం ఈ వారం ఓటింగ్ తేజ కి, శోభా కి చాలా చిన్న మార్జిన్ మాత్రమే ఉంది. ఈ వారం తేజ చేసిన కొన్ని మిస్టేక్స్ కారణంగానే తేజ ఎలిమినేట్ అయ్యాడని చెప్పొచ్చు.

పైగా లాస్ట్ వీక్ లో సందీప్ ని నామినేట్ చేసి ఒక రకమైన నెగిటివిటి మూట గొట్టుకోగా, ఈ వారం అంబటి అర్జున్ ని పెద్దగా రీసన్ లేకుండా నామినేట్ చేసి బ్యాడ్ అయ్యాడు. దాంతో ఎలిమినేట్ కాక తప్పలేదు.

- Advertisement -

అయితే తేజ నాలుగో వారంలోనే ఎలిమినేట్ కాకుండా తప్పించుకోగా, తేజ కి మారే ఛాన్స్ వచ్చినా, మారకుండా సేఫ్ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. అందుకే ఆడియన్స్ చూసి చూసి ఎలిమినేట్ చేసేసారు. అయితే శోభా కెప్టెన్ కాకపోయి ఉంటే తనే ఎలిమినేట్ అయ్యేదని ఆడియన్స్ అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు