Telugu Actress: బాలయ్య పై అలాంటి కామెంట్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్..!

పాయల్ ఘోష్.. ఈ బాలీవుడ్ నటి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఈ బ్యూటీ మంచు మనోజ్ తో కలిసి ప్రయాణం, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అయితే ఈమె ఎక్కువగా తెలుగులో సినిమాలు చేయలేదు. నార్త్ అమ్మాయి కావడంతో హిందీ సీరియల్స్, బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కానీ ఆమెకు నార్త్ కంటే సౌత్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుందని పలుమార్లు వెల్లడించింది. ఈమె చివరగా 2017లో ఓ హిందీ సినిమాలో కనిపించింది.

ఆ తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఓ రాజకీయ పార్టీలో చేరి రాజకీయాలలో కూడా యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది పాయల్ ఘోష్. ఇక ఈమె అప్పుడప్పుడు పలు వివాదాలలో కూడా నిలుస్తోంది. గతంలో ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి గళం విప్పిన విషయం తెలిసిందే. ఓ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఈమె తాజాగా నందమూరి బాలకృష్ణ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Balakrishna New Movie: అప్పుడు అబ్బాయి ఇప్పుడు బాబాయ్… ఫుల్ జోష్‌లో సీనియర్ హీరోయిన్?

- Advertisement -

బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసిన పాయల్.. “బాలకృష్ణ సార్ ఈ వయసులో కూడా సూపర్ హిట్ సినిమాలు ఇస్తున్నారు. టాలీవుడ్ నటనను చూసి బాలీవుడ్ యాక్టర్స్ నేర్చుకోవాలి” అని ట్వీట్ చేసింది. దీంతో ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె గతంలో పలువురు నటీనటులు, బాలీవుడ్ పై కూడా ఇలానే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి పాయల్ చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా బాలీవుడ్ లో స్పందిస్తారేమో వేచి చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు