Biggboss season7: అశ్విని తాను చేసిన తప్పుకి తానే బలవుతుందా?

బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుండగా, ఈ సీజన్లో అంతా ఉల్టా పల్టా డెసిషన్ల వల్ల ఒకరు గెలవాల్సింది మరొకరు గెలుస్తూ ఉన్నారు. దాని వల్ల ఆట మరింత రసవత్తరంగా సాగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కూడా గేమ్ చేంజర్ అవుతారని అర్జున్ నిరూపిస్తుంటే, తన ఆటతో ట్రోల్ అవుతూ, ప్రతి దానికి తప్పులు వెతకడం, ఎదుటి వారిపై చాడీలు చెప్పడం వల్ల అశ్విని లాంటి ప్లేయర్లు ఎలా ఆడకూడదో ప్రూవ్ చేస్తున్నారు.

ఈ సీజన్లో అశ్విని ఎంట్రీ ఇచ్చినప్పుడు నామినేషన్లో ఏడుపుమొహం పెట్టినప్పుడే ఎక్కువ రోజులు ఉండదని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎదో లక్ ఉండి ఇన్ని రోజులు నెట్టుకొస్తోంది గాని, అశ్విని ఈ సారి తన గొయ్యి తానే తవ్వుకుందని అనిపిస్తుంది.

Biggboss season7: ఎలిమినేట్ అయిన తేజ! ఊహించలేదు!

- Advertisement -

రెండు రోజుల కింద జరిగిన టాస్క్ లో గౌతమ్ కోసం అశ్విని ఆడగా, ఆ గేమ్ లో అశ్విని ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ గేమ్ కి ఆడడానికి ముందు, శివాజీ గౌతమ్ ని ఓడించడానికి వేరే వాళ్ళతో ప్లాన్ చేసాడని అశ్విని గౌతమ్ కి చెప్పింది. ఆ విషయం పై గౌతమ్ నాగ్ తో అనగా, నాగరాజును ఇది నిజం కాదని కేవలం అశ్విని అలా అనుకుందని చెప్పించాడు.

దీనిపై అశ్వినికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే ఇది చూసిన ఆడియన్స్ మాత్రం అశ్విని పై సీరియస్ గా ఉన్నారని కామెంట్స్ చూస్తే తెలిసిపోతుంది. దీన్ని బట్టి అశ్విని తాను చేసిన తప్పుకి తానే బలైందని, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అశ్విని ఎలిమినేట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ వారం తన ఆటని బట్టి ఎదో మ్యాజిక్ జరిగితే జరగొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు