Lavanya: తమ్ముడితో పెళ్లి.. అన్నతో రొమా**.. లావణ్య త్రిపాఠి గురించి ఈ విషయం తెలుసా..?

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇటీవలే ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి గురించే చర్చలు నడుస్తున్నాయి. అలా చర్చల ద్వారా ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ జంటపై ఏదో ఒక వార్తని సోషల్ మీడియాలో కల్పిస్తూనే ఉన్నారు.

తాజాగా లావణ్య త్రిపాఠి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ గా మారింది. అదేంటంటే తమ్ముడితో పెళ్లి.. అన్నతో రొమాన్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. వరుణ్ తేజ్ కి రామ్ చరణ్ అన్న అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే లావణ్య త్రిపాఠి ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ తో నటించింది కానీ రామ్ చరణ్ తో ఇంతవరకు ఏ సినిమాలో కూడా నటించలేదు. అయితే వీళ్ళిద్దరూ కలిసి నటించకపోయినా వీళ్ళ మధ్య రొమాన్స్ ఏముందా..? అని అనుకుంటున్నారా..? అవును చరణ్ – లావణ్య కలిసి ఏ సినిమాలో నటించకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య రొమాన్స్ జరిగిందట.

ఎలా అంటే.. చరణ్ – కాజల్ కాంబినేషన్ లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో మొదట రామ్ చరణ్ కి జంటగా కాజల్ అగర్వాల్ స్థానంలో లావణ్య త్రిపాఠిని తీసుకున్నారట మూవీ మేకర్స్. వీళ్ళిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా షూట్ చేశారట. అయితే చరణ్ తో లావణ్య ఫ్రీగా నటించలేక పోయిందట. ఎందుకంటే అప్పటికే లావణ్య వరుణ్ తేజ్ ని ప్రేమించిందట. దీంతో ఏం చేయాలో అర్థం కాక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరట్లేదని ఆమెను తీసేసి కాజల్ నీ కన్ఫామ్ చేశారట. ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు గానీ.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఒకవేళ ఈ వార్త నిజమైనా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు