Bala Krishna: చేసేది శివ పూజలు దూ******… బాలయ్య సినిమాపై హీరోయిన్ సెటైర్

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య నెక్స్ట్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇటీవలే బాలయ్య హీరోగా నటించిన “భగవంత్ కేసరి” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటించారు.

ఇక సినిమాలో కీలక ఘట్టమైన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి. ఇంతకుముందే ఈ కాన్సెప్ట్ తో పలు సినిమాలు తెరమీదకు వచ్చినప్పటికీ తాజాగా “భగవంత్ కేసరి” సినిమాలో బాలయ్య చెప్పిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమాపై తెలుగు బ్యూటీ మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది.

మాధవీలత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశం గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలోని టాప్ హీరోల చేత ఇలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయం గురించి చెప్పించడం చాలా మంచిది. కానీ హీరోయిన్ పాత్రని గ్లామర్ కే పరిమితం చేసి హీరో చేత అలాంటి డైలాగులు చెప్పించడం మాత్రం కరెక్ట్ కాదని పేర్కొంది. “భగవంత్ కేసరి” సినిమా విషయానికి వస్తే మూవీలో శ్రీలీల పాత్ర చాలా బాగుందని తాను విన్నట్టుగా చెప్పుకొచ్చింది.

- Advertisement -

కానీ అలా చేయకపోతే మాత్రం చేసేది శివ పూజలు దూరేది ఇంకేదో అన్నట్లుగా ఉంటుందంటూ సిట్యువేషన్ ని ఒక ఘాటు సామెతతో పోల్చింది. అంతటితో ఆగని ఈ బ్యూటీ డైలాగులు చెప్పడం వరకే కాదు, ఆ డైలాగులు చెప్పేవారు రియల్ లైఫ్ లో కూడా పాటిస్తే మంచిది అంటూ బాంబు పేల్చింది.

ఎందుకంటే మళ్లీ చేసేది శివ పూజలు దూరేది ఇంకేదో అనిపించేలా ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆమె ఎవరిని ఉద్దేశించి విమర్శించకపోయినా, మాధవి లత కామెంట్స్ ని చూస్తే బాలయ్యను పరోక్షంగా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. దీంతో బాలయ్య అభిమానులు ఇప్పుడు మాధవిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన “భగవంత్ కేసరి” గురించి, అలాగే తమ అభిమాన హీరో బాలయ్య గురించి అలాంటి ఘాటు కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కొంతమంది మాత్రం ఆమె బిజెపికి సపోర్ట్ చేస్తుంది. అలాగే బాలయ్య టిడిపిలో ఉన్నాడు. అందుకే ఇలా బాలయ్య పై పరోక్షంగా విమర్శలు చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ కాంట్రవర్షియల్ కామెంట్స్ తో మాధవీలత మరోసారి నెటిజన్ల దృష్టిలో పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలేమీ చేయడం లేదు. మరోవైపు బాలయ్య నెక్స్ట్ మూవీ సెట్స్ పైకి కూడా వెళ్ళిపోయింది. బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో హీరోయిన్లు ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు