Prabhas: కర్మ రిటర్న్స్… ప్రభాస్ విషయంలో కూడా తప్పదు !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కష్టాలు ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అసలు మన డార్లింగ్ కే ఇలా ఎందుకు జరుగుతోంది అన్పిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే లీకు రాయుళ్లు ఆ ఉత్సాహాన్ని నీరుగారుస్తూ ప్రభాస్ సినిమాల నుంచి పిక్, షూటింగ్, సీన్ ఎలా ఏదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘కల్కి 2898AD’ మూవీ షూట్ వీడియో మరోసారి లీక్ అయింది. పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో “కల్కి 2898 AD” అనే పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ చిత్రంలో కథానాయికగా, బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక కొత్తగా లీకైన “కల్కి 2898AD” ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నిర్మాతలను దిగ్భ్రాంతికి గురి చేసింది. లీకైన వీడియో 4 సెకన్ల పాటు ఉండగా, లీకైన వీడియోలో దీపికా పదుకొణె, మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఇండోర్‌లో సీన్లు షూట్ చేస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద సినిమాకు సంబంధించిన వీడియోలు సెట్స్ నుండి ఎలా లీక్ అవుతున్నాయి ? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మేకర్స్ కు కూడా ఈ విషయం అంతు చిక్కట్లేదు. ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా ఈ లీకుల పర్వాన్ని ఆపలేకపోతున్నారు.

కాగా ఇంతకుముందు కూడా ఇలాగే “కల్కి 2898 AD” నుంచి ఆన్-సెట్ స్టిల్స్‌ను అనధికారికంగా బయట పెట్టేశారు. దీంతో టీం బాధ్యులపై చట్టపరమైన తీసుకుంటామని గట్టిగానే హెచ్చరించింది. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ వీడియోలు ఆన్‌లైన్‌లో పదేపదే లీక్ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మేకర్స్ ఇలా లీకులు ఇస్తున్న వారిని కనిపెట్టడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కర్మ రిటర్న్స్ రా… ప్రభాస్ విషయంలోనూ ఇది తప్పదు. ప్రభాస్ అన్న సినిమా లీక్స్ ఇచ్చి, ఫ్యాన్స్ ను, చిత్రబృందాన్ని బాధ పెడుతున్న వారు ఏదో ఒకరోజు కర్మ అనుభవించక తప్పదు అని శాపనార్థాలు పెడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు