Grey Hair Tips: చిన్న ఏజ్ లోనే గ్రే హెయిర్… ఈ టిప్స్ తో నిగనిగలాడే జుట్టు మీ సొంతం

నేటి తరం యువతను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్ల జుట్టు ఒకటి. చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ జుట్టు నెరిసిపోవడం అనేది మన ఆహారంతో పాటు అనేక శారీరక సమస్యలకు సంకేతం. జుట్టు తెల్లబడడానికి విటమిన్ బి12 లోపం అత్యంత సాధారణ కారణం. దీనివల్ల వెంట్రుకలు తెల్లబడటమే కాకుండా సన్నగా, పొడిగా మారుతాయి. కొన్నిసార్లు థైరాయిడ్ సమస్య వల్ల కూడా జరగవచ్చు. మరి జుట్టు నెరసిపోకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి3, కాపర్, జింక్, ఐరన్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. ఇవి మీ జుట్టును బూడిద రంగులోకి మారకుండా హెల్ప్ చేస్తాయి. అలాగే నెరిసిన జుట్టును మళ్ళీ నల్లగా నిగనిగలాడేలా చేయడానికి ఈ ట్రిప్స్ ఫాలో అవ్వండి.

కరివేపాకు
కరివేపాకులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన జుట్టును చాలా తేలికగా నల్లగా మారుస్తుంది. 2 చెంచాల ఉసిరి పొడి, 2 చెంచాల బ్రహ్మీ పొడిని తీసుకోండి. ఇప్పుడు కరివేపాకును మెత్తగా రుబ్బుకుని మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లతో పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. 1 గంట పాటు ఉంచి, ఆపై మీ జుట్టును క్లీన్ గా కడిగేయండి.

- Advertisement -

కొబ్బరి నూనె
కొబ్బరి నూనెతో కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకుని, దానికి నిమ్మరసం కలిపి, స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి. సుమారు 1 నుండి 2 గంటలు అలాగే ఉంచి, ఆపై తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మీ జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.

బ్లాక్ టీ
టీని టీ తయారీకి మాత్రమే కాకుండా కొన్నిసార్లు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. నెరిసిన వెంట్రుకలు నల్లబడాలంటే, టీని ఒక గ్లాసు నీటిలో మరిగించి, దానిని ఫిల్టర్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత జుట్టుకు అప్లై చేసి, గంటసేపు అలాగే ఉంచి, ఆపై జుట్టును శుభ్రం చేసుకోండి. వారానికి ఒకసారి ఈ టిప్ పాటించి చూడండి.

Suffering from grey hair at a young age? Here are the tips

 

మందారం
మందార పువ్వు ఎంత అందంగా కన్పిస్తుందో మన జుట్టుకు కూడా అంత మేలు చేస్తుంది. మందారంతో జుట్టు బలంగా పెరుగుతుంది కూడా. మందార పువ్వులతో జుట్టు నల్లబడాలంటే, కొన్ని పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఈ నీటితో తలస్నానం చేయాలి. హెన్నాను ఉపయోగిస్తే దానికి కూడా రాత్రంతా నానబెట్టిన మందార పువ్వుల నీటిని కూడా కలపొచ్చు.

Suffering from grey hair at a young age? Here are the tips

ఉసిరికాయ
ఉసిరికాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉసిరిలో పుష్కలంగా లభిస్తాయి. ఉసిరి జుట్టును నల్లగా చేస్తుంది. 3 నుండి 4 ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, నీళ్లలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి జుట్టుకు పట్టించాలి. దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

Suffering from grey hair at a young age? Here are the tips

అలోవెరా
కలబందలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అలోవెరా జెల్‌ను తలకు పట్టించి గంట తరువాత స్నానం చేస్తే గ్రే హెయిర్ కొన్నాళ్ల తరువాత మాయం అవుతుంది.

Suffering from grey hair at a young age? Here are the tips

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు