Animal Story: ‘యానిమల్’ స్టోరీ లీక్… ఇంత వయోలెన్స్ తట్టుకోగలరా?

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “యానిమల్” కోసం ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యింది. అయితే మేకర్స్ స్వయంగా లీక్ చేశారు. అసలు మూవీ స్టోరీ ఏంటంటే…

‘అర్జున్ రెడ్డి’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని రూపొందించిన తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమా చేసాడు. అది కూడా హిందీ సినిమా, పైగా ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ గా ‘కబీర్ సింగ్’. ‘అర్జున్ రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ను ఇచ్చిన సందీప్ ఇప్పుడు ‘యానిమల్’ అంటూ సిల్వర్ స్క్రీన్ మీద ఆడియన్స్ కు మోస్ట్ వయోలెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్.

చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ‘యానిమల్’ నుంచి “నాన్నా నువ్ నా ప్రాణం” అనే సాంగ్ ను విడుదల చేసారు. ఈ సాంగ్ లో తండ్రీకొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా డీప్ గా చూపించారు సందీప్. అయితే ఈ సాంగ్ ను సరిగా గమనిస్తే స్టోరీ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.

- Advertisement -

హీరోకు చిన్నప్పటి నుంచి తండ్రి అంటే ప్రాణం. అయితే తండ్రికి ఈ విషయం తెలిసినా బిజినెస్ లో తలమునకలై పోయి ఉండడంతో కొడుకుతో స్పెండ్ చేయడానికి అసలు టైమే దొరకదు. చివరకు కొడుకు పెద్దయి, గర్ల్ ఫ్రెండ్ (రష్మిక మందన్నా) ను పరిచయం చేయడానికి వచ్చినా కూడా టైం ఇవ్వలేకపోతాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మన హీరో తండ్రికి దూరంగా వెళ్ళిపోయి, గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుని ఎక్కడో నివసిస్తూ ఉంటారు. అయితే కొంతమంది విలన్లు / బిజినెస్ పార్ట్నర్స్ తండ్రిని హత్యాయత్నం చేశారన్న పిడుగు లాంటి వార్తతో, ప్రశాంతంగా జీవిస్తున్న హీరో మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పటికే హీరో హీరోయిన్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఇక తన తండ్రిపై దాడి చేసిన విలన్లపై రివేంజ్ తీర్చుకునే నేపథ్యంలో తనలో దాగున్న ‘యానిమల్’ను బయటకు తీస్తాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది కోత.

ఇక సాంగ్ లాస్ట్ లో వచ్చే సన్నివేశంలో విపరీతంగా దెబ్బలు తగిలినప్పటికీ హీరో ఏమాత్రం తగ్గకుండా తాగి, ప్లేన్ ను నడపడం లాంటి ఇంటెన్స్ సీన్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. కాగా సందీప్ ‘కబీర్ సింగ్’ ప్రమోషన్స్ టైంలో ఇంత వయోలెంట్ గా మూవీ తీస్తున్నారు ? అనే ప్రశ్నకు బదులుగా ‘ఇదేం వయోలెన్స్… నా నెక్స్ట్ మూవీలో చూపిస్తా అసలు వయోలెన్స్’ అని అన్నారట. అన్నట్టుగానే తనలోని ‘యానిమల్’ను బయట పెట్టేస్తున్నాడు సందీప్. మరి ఈ వయోలెన్స్ ను థియేటర్లలో ప్రేక్షకులు తట్టుకోగలరా ? అనేది వేచి చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు