VaishnavTej: ఒక్క పాజిటివ్ బజ్ లేదు.. ఇక దానిపైనే ఆదికేశవ హోప్స్!

టాలీవుడ్ లో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా “ఆదికేశవ”. ఉప్పెన ఫేమ్ సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో జులై లో రిలీజ్ కావాల్సి ఉండగా, పెద్ద సినిమాల పోటీ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక ఆగష్టు లో భోళా శంకర్, జైలర్ సినిమాల వల్ల రిలీజ్ డేట్ ని మార్చుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ లో స్కంద సినిమా వల్ల పోటీ నుండి తప్పుకుని నవంబర్ 24కి షిఫ్ట్ అయ్యింది.

వాయిదాల సంగతి అటుంచితే ఈ సినిమా పై ఇప్పటివరకు సరైన బజ్ క్రియేట్ కాలేదన్నది వాస్తవం. పైగా సినిమాని నిర్మిస్తుంది బడా ప్రొడ్యూసర్ నాగవంశీ. అలాంటప్పుడు మార్కెటింగ్ పై ఎంత దృష్టి పెట్టుంటాడు. టెలివిజన్ లో కూడా కొన్ని రోజుల నుండి పలు ప్రోగ్రాం లలో ఆది కేశవ్ టీం సందడి చేసారు. కానీ రిలీజ్ అయిన టీజర్, ఇంకా పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. పైగా ప్రమోషన్లు కూడా హీరోహీరోయిన్ల తో తప్ప మూవీ మేకర్స్ పాల్గొనలేదు. అలాంటప్పుడు మూవీ కాన్సెప్ట్ గురించి ఆడియన్స్ కి ఎలా అర్ధమవుతుంది.

రిలీజ్ టైం కూడా దగ్గరపడుతుంది. ఇక ఈ సినిమాపై బజ్ రావాలన్నా, సినిమాపై ఆడియన్స్ కి ఒక అవగాహన రావాలన్నా, ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఆదికేశవ ట్రైలర్. ఈ ట్రైలర్ నవంబర్ 17న రిలీజ్ అవుతుండగా, ఈ ట్రైలర్ జనాల్లోకి వెళ్లడం పైనే ఆదికేశవ టీమ్ ఆశలున్నాయని చెప్పొచ్చు. పైగా సినిమాకి శ్రీ లీల తప్ప ఇప్పటివరకూ ఏ అడ్వాంటేజ్ రాలేదని ఆడియన్స్ కూడా ఒక రకంగా వైష్ణవ్ ని ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ ట్రైలర్ తో ఆది కేశవ మేకర్స్ ఎలాంటి సమాధానం ఇస్తారో, సినిమాపై బజ్ ఎంతవరకు క్రియేట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు