స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో నిన్నటి వరకు ఎవిక్షన్ టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. అంబటి అర్జున్ గెలుపుతో మొదలైన ఈ టాస్క్ లో అన్ని టాస్కుల్లో కూడా యావర్ గెలవడం జరిగింది. ఈ టాస్క్ లో ఎక్కువ ఫిజికల్ గేమ్స్ ఉండగా అన్నింటిలో యావర్ తనదైన శైలిలో ఆడి ఏవిక్షన్ టెస్ట్ లో పాసయ్యాడు. ఇక ఈ పాజిటివిటీ తో యావర్ కం బ్యాక్ అవగా, తన పెర్ఫార్మన్స్ తో ఈ వారం ఎలిమినేషన్ నుండి కూడా సేవ్ అవుతాడని తెలుస్తుంది.
అయితే ఈ టాస్క్ పూర్తయి కొన్ని గంటలైనా కాకముందే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ని మొదలుపెట్టేశాడు. ఇక ఈ టాస్క్ కూడా లాస్ట్ వీక్ లాగా చాలా చిన్నగా ఒక్కరోజులోనే అవగొట్టేలా డిజైన్ చేయగా, ఆ టాస్క్ మొదలెట్టిన కొన్ని నిమిషాలకే రతిక, గౌతమ్ టాస్క్ లో ఊడి బయటికి వచ్చేసారు.
ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ కి శోభా శెట్టిని సంచాలక్ గా నియమించగా, ఫిజికల్ టాస్క్ గా జరిగిన ఈ గేమ్ లో ఎక్కువ శాతం యావర్, అర్జున్, అమర్ దీప్, ప్రశాంత్ లు యాక్టీవ్ గా ఆడుతున్నారు. అయితే తాజాగా వచ్చిన సమహాకారం ప్రకారం ప్రియాంక ఈ వారం కెప్టెన్ అయ్యేలా బిగ్ బాస్ గేమ్ ప్లాన్ చేసాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని, తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అమర్ దీప్ చాలా ఫైర్ అయ్యాడని తెలుస్తుంది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify