Jagapathi Babu: హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న జగ్గూ భాయ్.. దీని కోసం ఏం చేశారంటే..?

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే నటీ నటులు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న తర్వాత తదుపరి ఇండస్ట్రీలపై దృష్టి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది సౌత్ నుంచి నార్త్ కి.. నార్త్ నుంచి సౌత్ కి వచ్చి తమకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు చాలామంది పాన్ ఇండియా నటులుగా చలామణి అవుతూ ఏకంగా హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే బాటలో ప్రముఖ హీరో కం విలన్ జగపతిబాబు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.

ఇకపోతే జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు విలన్ గా తనలోనే అద్భుతమైన నటనను కనబరుస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ తెలుగులోనే కాకుండా హిందీ , కన్నడ, తమిళ్, మలయాళం భాషలలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

- Advertisement -

ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను ఒక సలహా అడిగారు. ఏమిటా సలహా అనే విషయానికొస్తే.. తనకు హాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని.. వెళ్ళమంటారా? అంటూ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంటూ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

జగపతిబాబుకి హాలీవుడ్లో సినిమా అవకాశాలు వస్తున్నాయంటూ అభిమానులకు తెలియజేయడంతో కొంతమంది ఈ పోస్ట్ పై స్పందిస్తూ హాలీవుడ్లో అవకాశాలు రావడం అంటే నిజంగా గ్రేట్.. అక్కడికి వెళ్లి మీ సత్తా చూపించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది హాలీవుడ్ ఇండస్ట్రీని కూడా దున్నేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఇక్కడే మీ విలనిజాన్ని తట్టుకోలేకపోతున్నాము.. హాలీవుడ్ ఇండస్ట్రీ మిమ్మల్ని భరించగలరా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇలా మొత్తానికైతే తనకు హాలీవుడ్ లో అవకాశం వచ్చిందని.. చెప్పడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తనకు ఏ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో అవకాశం వచ్చింది అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు జగపతిబాబు.. మొత్తానికైతే హాలీవుడ్లో అవకాశాన్ని దక్కించుకున్న ఈయన ఖచ్చితంగా సక్సెస్ కావాలి అని సినీ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు