Priyanka Chopra : వరుసగా ఆస్తులు అమ్మేసుకుంటున్న స్టార్ హీరోయిన్… అంత కష్టం ఏమొచ్చింది ?

బాలీవుడ్‌లోనూ, హాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. 2018లో నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత, ప్రియాంక లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపొయింది ఈ గ్లోబల్ బ్యూటీ, అక్కడ ఈ సెలబ్రిటీ భార్యాభర్తలు ఇద్దరూ తమ కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి నివసిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకే పరిమితమైపోయిన ప్రియాంక, అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి, తన కుటుంబ సభ్యులతో కలిసి కొంత టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తరువాత షరా మామూలే. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ వరుసబెట్టి తనకు ఇండియాలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటోందట. మరి ఆమెకు ఆస్తులు అమ్ముకునేంత కష్టం ఏం వచ్చింది ? అంటే…

హాలీవుడ్‌లో ఎక్కువగా వర్క్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్న ప్రియాంక, తన ఆస్తులను కూడా విదేశాల్లోనే పెంచుకోవాలి అనుకుంటోంది. అందుకే ముంబైలోని అంధేరిలో ఉన్న తన రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను దర్శకుడు, రచయిత అభిషేక్ చౌబేకి అమ్మేసిందట. ఈ అపార్టుమెంట్లకు మొత్తంగా రూ.6 కోట్లు తీసుకుందట ప్రియాంక.

గతంలో ప్రియాంక చోప్రా నివసించిన ఈ ఇల్లు లోఖండ్‌వాలాలోని కరణ్ అపార్ట్‌మెంట్ టవర్‌లో, 9వ అంతస్తులో ఉందట. ఈ అపార్ట్మెంట్ మొత్తం 2,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రియాంక తల్లి మధు చోప్రా సహాయంతో అక్టోబర్ 23, అక్టోబర్ 25 తేదీల్లో అమ్మేసినట్టు సమాచారం. అభిషేక్ చౌబే రూ.36 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి ఈ ఇంటిని కొనుగోలు చేశారట. అంతకుముందు, ప్రియాంక లోఖండ్‌వాలాలోనే ఉన్న మరొక ఆస్తిని 2021లో అప్పటికే అందులో అద్దెకు ఉంటున్న ఒక డాక్టర్ కి 7 కోట్ల రూపాయలకు అమ్మేసింది.

- Advertisement -

అయితే ప్రియాంక అక్కడ ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఇక్కడ అమ్మడం దేనికి? ఆ రెండు అపార్టుమెంట్లకు భారీగానే రెంట్ వస్తుంది కదా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. మరి ప్రియాంక అసలు ప్లాన్ ఏంటి అనే విషయంపై ఆమెనే క్లారిటీ ఇవ్వాలి.

ప్రియాంక సినిమాల విషయానికొస్తే… ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’లో జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో స్క్రీన్‌ షేర్ చేసుకోబోతోంది. ఇంకా ‘సిటాడెల్ 2’ అనే వెబ్ సిరీస్ లో, అలియా భట్, కత్రినా కైఫ్‌, ఫర్హాన్ అక్తర్ లతో కలిసి ‘జీ లే జరా’ అనే మూవీలో కూడా నటిస్తోంది
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు