Raviteja : మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం విరామం లేకుండా సినిమాలపైనే పని చేస్తున్నాడు అయితే ఇటీవల కాలంలో ఆయన నటించిన చిత్రాల్లో కొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. ఆయా సినిమాలకు వసూళ్లు కూడా చాలా తక్కువగా ఉండడంతో నిర్మాతలు బాగా నష్టపోయారు. ప్రస్తుతం రవితేజ తన నెక్స్ట్ మూవీ “ఈగల్”పై ఫోకస్ చేశారు. ఇక ఆ తరువాత తన నెక్స్ట్ మూవీని డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేయబోతున్నట్టు ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుందని, 1990 లలో అగ్రవర్ణాలు, నిన్న కులాల మధ్య జరిగిన కుల తగాదాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. .

డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం ఇది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే రవితేజ అభిమానుల ఉత్సాహానికి బ్రేక్ వేసేలా తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అనుకోని అడ్డంకి రావడంతో ఈ సినిమా వాయిదా పడిందట. సినిమా బడ్జెట్ భారీగా ఉండడంతో నిర్మాతలు మూవీని హోల్డ్ లో పెట్టారట.

నిజానికి అందులో రవితేజ రెమ్యూనరేషన్ గా 25 కోట్లు పైగా డిమాండ్ చేస్తున్నాడట. ఇక గోపీచంద్ కూడా ఈ సినిమాతో భారీగానే అందుకోవాలని చూస్తున్నారట. మరోవైపు సినిమా ఖర్చు… మొత్తంగా కలిపి చూస్తే అంచనా ప్రకారం బడ్జెట్ 100 కోట్ల మార్క్ దాటుతోందట. నిజానికి రవితేజ మార్కెట్ కు ఈ బడ్జెట్ చాలా దూరంలో ఉంది. ఇటీవల వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అందుకు నిదర్శనం.

- Advertisement -

ఇక మూవీకి అంచనానే 100 కోట్లు అయితే, ఆ తర్వాత మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పేపర్ లోనే 100 కోట్ల బడ్జెట్ మించిపోతే, రవితేజ మార్కెట్ ప్రకారం శాటిలైట్, ఓటిటి బిజినెస్ భారీగా తగ్గిపోవడంతో ఈ బడ్జెట్ రికవరీ కాదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారట.

అలా సినిమా బడ్జెట్ కు, రవితేజ మార్కెట్ కు చాలా దూరం ఉందని భావించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారట. బడ్జెట్ ను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవేళ అనుకున్న దాని ప్రకారం బడ్జెట్ చేంజ్ చేస్తే ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది. లేదంటే ఈ సినిమాను పక్కన పెట్టి రవితేజ తన నెక్స్ట్ మూవీ చేసే అవకాశం ఉంది. మొత్తానికి రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రవితేజ, గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాలతో ఇలా ఆగిపోవడం నిరాశ కలిగించే విషయమని చెప్పాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు