బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబో లో వస్తున్న పాన్ ఇండియా మూవీ “అనిమల్”. ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గరి నుండి సినిమా టీజర్, ట్రైలర్ కూడా ఓ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుని అనిమల్ పై ఉన్న అంచనాల్ని భీభత్సంగా పెంచేసాయి.
ఇక ఆనిమల్ పై ఇన్ని అంచనాలు పెరగడానికి కారణం సందీప్ రెడ్డి వంగయే అని తెలిసిందే. డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం అనిమల్ మేకర్స్ అటు హిందీ, ఇటు తెలుగులో కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అనిమల్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
యానిమల్ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ దాదాపు 18 నిమిషాల పాటు ఉంటుంది. ఈ ఇంటర్వెల్ బ్లాక్ కి సంబందించిన సీక్వెన్స్ ను ఆల్రెడీ ప్రీ టీజర్, టీజర్ మరియు ట్రైలర్లో కూడా చూపించారు. ఇక ఈ మొత్తం ఆక్షన్ ఎపిసోడ్ ని ఫైట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ మాస్టర్ రూపొందించారు. సినిమా మొత్తంలో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఇంటర్వెల్ నుండే స్టార్ట్ అవుతాయట. ఇక్కడి నుండే రణబీర్ లోని మరో యాంగిల్ బయటపడుతుందట.
ఇక ట్రైలర్లో చూపిన ప్రత్యేకమైన వార్ మెషీన్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ రూపొందించారు. అనిమల్ సినిమా దాదాపు 203 నిమిషాల నిడివితో ఉండడం విశేషం.
For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News