Telangana Assembly elections 2023 : బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎలా ఓటేశారో తెలుసా?

తెలంగాణలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. టాలీవుడ్ యాక్టర్స్ అంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభాస్ తో పాటు కొంతమంది యంగ్ హీరోలు మాత్రం ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాలావరకు సామాన్య ప్రజలంతా ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. అయితే హైదరాబాద్ లో మాత్రం కేవలం 40 శాతం ఓటింగ్ పోల్ అవ్వడం గమనార్హం. అంటే హైదరాబాద్ లో ఉన్న చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరి తెలుగు పాపులర్ షో “బిగ్ బాస్ తెలుగు సీజన్ 7″లో ఉన్న హౌస్ మేట్స్ పరిస్థితి ఏంటి? అందులో ఉన్న హౌస్ మేట్స్ తమ ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నారు? ఓటు వేస్తే వాళ్ళు బయటకు వచ్చి వెళ్ళారా? ఎప్పుడు ఎలా ఓటు వేశారు? అనే డౌట్స్ చాలా మందికి వచ్చే ఉంటాయి.

ప్రస్తుతానికి హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లో ఉన్న ఉమెన్స్ హాస్టల్ లో ఓటు వేసిన విషయం తెలిసిందే. మరి హౌస్ మేట్స్ విషయానికి వస్తే… ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దరు మాత్రమే తెలంగాణకు చెందిన వారని తెలుస్తోంది. గౌతమ్ కృష్ణ, శివాజీ, యావర్, శోభ శెట్టి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి ఉన్నారు. అయితే ఇద్దరైనా సరే ఓటు మాత్రం వేయాల్సిందే కదా అంటే.. ఖచ్చితంగా అవును.

తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇద్దరే ఇద్దరు. ఒకరు గౌతమ్ మరొకరు ప్రశాంత్. అయితే వీరిద్దరి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ప్రకారం ఈ కంటెస్టెంట్స్ ఇద్దరు బ్యాలెట్ ఓటు హక్కు ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా సామాన్య ప్రజలతో పాటు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినిమా షూటింగ్ లను సైతం పక్కన పెట్టి ఉదయాన్నే కుటుంబాలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, ఓటు వేసి వెళ్లారు. అయితే ప్రభాస్, అక్కినేని అఖిల్, వరుణ్ తేజ్, శర్వానంద్, విశ్వక్ సేన్, అల్లరి నరేష్, మంచు విష్ణు, మోహన్ బాబు, శివ బాలాజీ వంటి వారు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోలేదు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు