BiggbossFinaleTask: ఈ సారి అర్జున్ మొహం మాడిపోయింది..!

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 మరో 20 రోజుల్లో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో మొత్తం ఎనిమిది మంది మిగలగా, వీళ్ళ మధ్య ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ టాస్క్ మొదలై ఒక్క ఛాలెంజ్ లో ముందుకెళ్లే కొద్దీ, ఒక్కో కంటెస్టెంట్ టాస్క్ నుండి బయటికి వచ్చేసారు. ఫైనల్ గా ఈ టాస్క్ లో నలుగురి మధ్య ఉండగా, ఇప్పుడు ముగ్గురయ్యారు.

తాజాగా గౌతమ్ కూడా ఈ టాస్క్ నుండి ఓడిపోయాడు. ఇక బిగ్ బాస్ గౌతమ్ కి చెందిన 140 పాయింట్స్ ని ఎవరికీ ఇస్తాడో డిసైడ్ చేసుకోమనగా, గౌతమ్ ప్రియాంక కోసం అమర్ కి ఇచ్చాడు. ఈ విషయంపై అర్జున్ మొహం మాడ్చుకున్నాడు.

ఎందుకంటే అర్జున్, గౌతమ్ ముందు నుండి కలిసి పోరాడగా, అర్జున్ గౌతమ్ పాయింట్స్ తనకే ఇస్తాడని అనుకున్నాడు. కానీ ప్రియాంక అమర్ ని కూల్ చేయడం కోసం గౌతమ్ ని ఆ పాయింట్స్ ఇచ్చేయమని చెప్తుంది. అటు గౌతమ్ కూడా ఇంతకు ముందు ప్రియాంక పాయింట్స్ ఇచ్చినందువల్ల, దానికి ఫేవర్ గా అమర్ కి పాయింట్స్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో ముందు నుండి ఎవరి పాయింట్స్ ఎవరికీ ఇచ్చినా అందరూ అలకమొహాలే చూపించారు. కానీ స్ట్రాంగ్ ప్లేయర్ అయిన అర్జున్ కూడా ఇలా చేస్తాడని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు