Telugu Actress: ప్రగతి చేతిపై టాటూ.. అసలు రహస్యం ఏమిటంటే..?

ప్రస్తుత కాలంలో టాటూ అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ టాటూ లను వేయించుకుంటున్నారు అయితే వీటి వెనుక కొన్ని మనకు తెలియని రహస్యాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోని ప్రముఖ నటిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కగా, వదినగా, అత్తగా, తల్లిగా ఇలా పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. కరోనా వచ్చినప్పటి నుంచి సినిమాలలో అవకాశాలు లేక ఎక్కువగా సోషల్ మీడియాలోనే సమయాన్ని గడిపేది.

నాలుగు పదుల వయసులో కూడా జిమ్ లో వర్కౌట్లు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచిన ప్రగతి.. వరుస గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మంట రాజేసింది. ఇక నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె ఎప్పటికప్పుడు తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఎప్పుడూ తన అందాల ఫోటోల గురించి మాట్లాడుకునే నెటిజన్స్..ఈసారి ఆమె చేతి పై ఉన్న టాటూ గురించి దాని వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన ఈమె ఈ క్రమంగా గతంలో పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఆమె మాట్లాడుతూ.. మాది హైదరాబాద్.. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాను.. ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాము.. అయితే చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదురయ్యాయి. ఇక అమ్మకు సహాయం చేయడానికి కార్టూన్ పాత్రలకు మొదట్లో డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మైసూర్ సిల్క్ ప్యాలెస్ షో రూమ్ కోసం మోడల్ గా కూడా పనిచేశాను. ఆ తర్వాతే హీరోయిన్ గా అవకాశం వచ్చింది అని తెలిపారు .

- Advertisement -

ఇకపోతే అదే సమయంలో టాటూ గురించి కూడా వెల్లడించింది. నా చేతిపై ఉండే టాటూ కి ఒక ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.. చిన్నతనంలో ఒక వ్యాక్సిన్ సెప్టిక్ అయ్యి మచ్చ పడింది.. అది కనిపించకుండా ఉండడానికి ఈ టాటూ వేయించాను అంటూ ప్రగతి తెలిపింది. ఇక ప్రగతి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మోత్చనికైతే గాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాను ఈ విధంగా టాటూ వేయించుకున్నానని చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు