Hero Nani : తెలంగాణలో ప్రభుత్వం మారడంపై హీరో నాని హాట్ కామెంట్స్..!

వైవిధ్యమైన సినిమాలు చేయడంలో అలాగే వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో ముందుంటారు హీరో నాని. ఇటీవల దసరా లాంటి సూపర్ హిట్ తరువాత ఇప్పుడు మళ్లీ మనందరి ముందుకి “హాయ్ నాన్న” అనే సినిమాతో రాబోతున్నారు. నాచురల్ స్టార్ నాని – మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఫాదర్, డాటర్ సెంటిమెంట్ తో ఈ చిత్రం రాబోతుండడం, మూవీ ట్రైలర్, సాంగ్స్ సూపర్ డూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర ప్రమోషన్స్ ని చాలా స్ట్రాంగ్ గా జరుపుతున్నాడు నాని. అంతేకాదు ఇప్పటివరకు ఏ సినిమాకి చేయనంత వెరైటీగా ఈ చిత్రానికి ప్రమోషన్ చేస్తున్నాడు. ఇటీవల తన ప్రమోషన్స్ లో తెలంగాణ ఎలక్షన్స్ ని కూడా వాడేశాడు. కెసిఆర్ ని ఇమిటేట్ చేసి ఆయన రిపోర్టర్స్ తో ఎలా మాట్లాడుతారో అలానే మాట్లాడి అందరిని ఆకట్టుకున్నాడు.

అయితే తాజాగా ట్విట్టర్ (ఎక్స్) లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన నాని.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల రిజల్ట్ గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. ” పదేళ్లు బ్లాక్ బస్టర్ సినిమా చూశాం. థియేటర్ లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం” అని రిప్లై ఇచ్చాడు.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు