Vijay Varma: ఆ జ్యోతిష్యుడు వల్లే నష్టపోయా.. కానీ చివరికి – విజయ్ వర్మ

ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఒకప్పుడు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ మిల్క్ బ్యూటీ తమన్నతో లవ్ ట్రాక్ నడిపినప్పటి నుండి అందరికీ సుపరిచితుడు అయిపోయారు. ఎన్నో సినిమాలలో నటించినా రాని గుర్తింపు కేవలం తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత పాపులారిటీ లభించింది. తెలుగులో నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. విలన్ గా విజయ్ వర్మకు మంచి పేరు వచ్చినా.. తమన్నా బాయ్ ఫ్రెండ్ గా వచ్చినంత గుర్తింపు అయితే రాలేదని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని ఒక జ్యోతిష్కుడు నాశనం చేయాలని చూశాడని.. అసలు విషయాన్ని బయటపెట్టారు విజయ్ వర్మ. ఆయన మాట్లాడుతూ.. ఎన్నో అవకాశాలు వచ్చాయి.. అయితే వచ్చిన అవకాశాలు చేజారి పోయాయి.. అలా ఒకసారి ఒక పెద్ద సినిమాలో అవకాశం రాగా.. కొన్ని ఫోటోలు పంపమని చెబితే ఫోటోలు కూడా పంపించాను. కానీ కొద్ది రోజులకే సినిమా నుండి తొలగించారు. దీనికి ప్రధాన కారణం ఆ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ కి జ్యోతిష్యం మీద ఉన్న నమ్మకమే .. అయితే ఆ డైరెక్టర్ దగ్గర ఉండే ఒక జ్యోతిష్కుడు తనను సినిమా నుండి తీసేయమని చెప్పారట. అందుకే ఆ సినిమాలో అవకాశం కోల్పోయాను.. ఒకవేళ అదే సినిమాలో నటించి వుంటే అప్పుడే చాలా గుర్తింపు లభించేది అంటూ తెలిపారు విజయ్ వర్మ.

ఇకపోతే బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నన్ను చాలా ఓదార్చారు.. ఇక ఆరోజు ఆయన చెప్పిన మాటలు ఇన్స్పైర్ గా తీసుకున్నాను.. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నసీరుద్దీన్ షా తెలిపారు. అయితే సమస్య వచ్చినప్పుడు డీలా పడిపోకూడదు అని.. ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు.. ఆయన చెప్పిన మాటలే నేడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమయ్యాయి అంటూ విజయ్ వర్మ తెలిపారు. ఇకపోతే ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని డబ్బులు కోసం కొన్ని సినిమాలలో ఇష్టం లేకుండా కూడా చిన్న పాత్రలో చేయాల్సి వచ్చింది . ప్రస్తుతం మీ ముందు నటుడిగా గుర్తింపు ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నాను అంటూ తెలిపారు విజయ్ వర్మ .

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు