Nayanthara: యంగ్ హీరోకి అక్కగా నటించబోతున్న నయనతార.. ఆయన ఎవరంటే..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ ఎవరంటే ప్రతి సినీ ప్రేక్షకులు కూడా నయనతార పేరు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే మొదట్లో గ్లామర్ పాత్రలతోనే అందరిలా ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. తన గ్లామర్ అండ్ యాక్టింగ్ తో లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ, స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక నయనతార తన ప్రియ సఖుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు తల్లయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నయనతారకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార ఇప్పుడు ఏకంగా ఓ యంగ్ హీరోకి అక్క పాత్రలో కనిపించబోతుందట. ఆ హీరో మరెవరో కాదు డైరెక్టర్, నటుడు ఐన ప్రదీప్ రంగనాథన్. కోమాలి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్.. ఆ తరువాత హీరోగా లవ్ టుడే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ప్రదీప్ కి క్రేజ్ బాగా పెరిగింది.

అందుకే ఆయన చేస్తున్న సినిమాలపై కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ప్రదీప్ మరో కొత్త సినిమాకి ఓకే చెప్పేశారు. అయితే దర్శకుడిగా మాత్రం కాదు. ప్రదీప్ హీరోగా నయనతార భర్త విగ్నేష్ శివన్ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కి అక్కగా నయనతార నటించబోతుందట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు