Tripti Dimri : ‘యానిమల్’ బ్యూటీకి రవితేజ టెంప్ట్… నెక్స్ట్ మూవీలో ఛాన్స్

ఇప్పుడు ఎక్కడ చూసినా “యానిమల్” మూవీ గురించే చర్చ నడుస్తోంది. ఈ మూవీతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందన్న, కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి దిమ్రి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. సినిమాలో మితిమీరిన శృంగారం, వైలెన్స్ ఉండడంతో ఒక వర్గం వారు విమర్శిస్తున్నా, ప్రేక్షకులు మాత్రం మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం 500 కోట్లను కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తున్న “యానిమల్” మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన బ్యూటీ త్రిప్తి.

ఈ సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులంతా త్రిప్తిని మరిచిపోలేకపోతున్నారు. అసలు జోయా పాత్రలో నటించిన ఆ బ్యూటీ ఎవరు? అంటూ ఆరాలు తీయడంతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. త్రిప్తి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి అందరూ బాగా ఆసక్తిని కనపరిచారు. ఇక సినిమాలో ఏకంగా నగ్నంగా కనిపించడానికి సాహసం చేసిన ఈ బ్యూటీపై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. “యానిమల్” మూవీలో రణబీర్ కపూర్, త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు కుర్రాళ్లను హీటెక్కించాయి. మైండ్ బ్లాక్ చేసే అలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించిన త్రిప్తి ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అంతేకాకుండా టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి ఆఫర్ల వెలువ రావడం ఖాయం అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. అందరూ అనుకున్నట్టుగానే తృప్తికి టాలీవుడ్ నుంచి ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి.

తెలుగులో ఈ బ్యూటీకి తాజాగా బంపర్ ఆఫర్ తగిలినట్టు ప్రచారం జరుగుతుంది. త్రిప్తి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి మాస్ మహారాజా రవితేజ టెంప్ట్ అయినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్న ఈ ప్రాజెక్టు దాదాపుగా ఫైనల్ అయిందట. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాకు త్రిప్తి ఫీవర్ పట్టుకోవడంతో రవితేజతో రొమాన్స్ చేసే చాన్స్ ఈ బ్యూటీ కి రావడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. అయితే ఈ విషయంపై ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ రవితేజతో మూవీ గనక హిట్ అయితే టాలీవుడ్ లో త్రిప్తి ఫేట్ మారినట్టే. ఇక అనిల్ రావిపూడి అంటే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం బలంగా ఉంది. కాబట్టి తెలుగులో త్రిప్తి బిజీ అవ్వడానికి ఇదే మంచి అవకాశం.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు