Hi Nanna : నాని వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ప్రమోషన్ స్టార్ట్ చేసేసిందిగా !

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హాయ్ నాన్న” ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య అంజన సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీంతో అంజన కూడా మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నైటిజన్లు. మరి “హాయ్ నాన్న” మూవీపై అంజన కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం.

నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం “హాయ్ నాన్న”. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించగా, డైరెక్టర్ శౌర్యువ్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ప్రస్తుతం సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే రివ్యూవర్స్ నుంచి మాత్రం “హాయ్ నాన్న” మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నాని వైఫ్ ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేసింది. అందులో నాని తన కొడుకుతో కలిసి సినిమా చూస్తున్నారు. ఆ సమయంలో నాని చేతిని ఆయన కొడుకు గట్టిగా హాగ్ చేసుకున్నాడు. ఈ ఫోటోను షేర్ చేసిన అంజన “హాయ్ నాన్న” మూవీని చూసినప్పుడు ఇలాంటి ఫీలింగే కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజెన్లు మాత్రం అంజనా కూడా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాని కూడా మూవీ ప్రమోషన్స్ విషయంలో బాగానే కష్టపడ్డాడు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా స్టార్ హీరోలతో సైతం కలిసిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సీనియర్ హీరో వెంకటేష్, ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాలను కూడా మూవీ ప్రమోషన్స్ లో భాగం చేశాడు. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

- Advertisement -

“హాయ్ నాన్న” మూవీ మొత్తం తండ్రి కూతుర్ల చుట్టే తిరుగుతుంది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా యూత్ ను కూడా అట్ట్రాక్ట్ చేసే రొమాంటిక్ అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సాఫ్ట్ జోనర్ మూవీ “యానిమల్’ లాంటి మూవీ చేస్తున్న వయోలెన్స్ ముందు నిలబడుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయ్యి వారం గడిచినప్పటికీ ‘యానిమల్’ హవా ఏమాత్రం తగ్గలేదు. మరి ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలియాలంటే ఈ వీకెండ్ దాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు