Makeup Tips : ఈ మేకప్ మిస్టేక్స్ చేస్తే ముసలి వాళ్ళలా కన్పిస్తారు జాగ్రత్త !

మేకప్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు ఉంటాయి. కానీ ప్రధాన కారణం ఏంటంటే మేకప్ వేసుకుంటే ఫిజికల్ గా అందంగా కనిపించడమే కాకుండా మెంటల్ గా కాన్ఫిడెంట్ గా కూడా ఉంటారు. మొత్తానికి మేకప్ వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది నిజం. అయితే అందరూ మేకప్ ని కేవలం కాన్ఫిడెన్స్ కోసం వేస్తారు అనుకుంటే మీరు పొరపడినట్లే. కొంతమంది తమ మొహంపై ఉన్న మచ్చలను దాచుకోవడానికి మేకప్ వేస్తే, మరికొంతమందికి అదొక హ్యాబిట్. అయితే మేకప్ వేసుకున్నప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మీరు ముసలి వాళ్ళలా కనిపించే అవకాశం ఉంది. మరి ఎలాంటి తప్పులు చేస్తే ముసలి వాళ్ళలా కనిపిస్తారో తెలుసుకుందాం.

ప్రైమర్
నిజానికి ప్రైమర్ వేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి.  ప్రైమర్ మీ చర్మానికి అలాగే రసాయనాలతో నిండిన మేకప్ కి మధ్య రక్షణ పొరగా మారి చర్మాన్ని కాపాడుతుంది. అలాగే మీ స్కిన్ పై ఉన్న రంద్రాలను మూసేస్తుంది. ఇక మీ మేకప్ సెట్ చేయడానికి మంచి బలమైన పునాదిని స్కిన్ పై నిర్మిస్తుంది. ఒకవేళ మంచి ప్రైమర్ ని ఉపయోగించకపోతే మీ మేకప్ అంతా ఈజీగా చెడిపోతుంది. ఆరోజు ఎండ్ అయ్యేలోపు మీరు ముసలి వాళ్లు బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తారు. కాబట్టి మంచి ప్రైమర్ ని ఎంచుకోవడం ముఖ్యం.

ఫౌండేషన్
వయస్సు ఎంత ఉన్నప్పటికీ సరైన ఫౌండేషన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. పొడి చర్మం ఉండేవారు పౌడర్ ఫౌండేషన్ వేసుకుంటే చాలా దారుణంగా కనిపిస్తారు. మొహంపై ఉండే గీతలు, రంధ్రాలు హైలెట్ అవుతాయి. దీంతో ముసలి వాళ్ళ లాగా కనిపిస్తారు. కాబట్టి మీ చర్మానికి తగినట్టుగా లిక్విడ్ లేదా క్రీమ్ ఫౌండేషన్ ఎంచుకోవడం బెటర్.

- Advertisement -

స్కిన్
మేకప్ అనేది పెయింటింగ్ లాంటిది అంటుంటారు మేకప్ ఆర్టిస్టులు. అయితే మేకప్ వేయడానికంటే ముందు చర్మం ఆరోగ్యంగా, మాయిశ్చరైజర్డ్ గా ఉండడం చాలా ముఖ్యం. అప్పుడైతేనే నిగనిగలాడే మేకప్ మీ సొంతమవుతుంది.

కన్సీలర్
ముఖంపై, కళ్ల కింద మచ్చలను దాచుకోవడానికి సరైన కన్సీలర్ ను ఎంచుకోవాలి. లేదంటే మేకప్ మొత్తం నాశనం అవుతుంది.

కంటౌరింగ్ అండ్ హై లైటింగ్
వీటివల్ల ముఖం ఎంత యవ్వనంగా కనిపిస్తుందో ఒకవేళ తప్పుగా వాడారు అంటే అంతే దారుణంగా కనిపిస్తారు.

మ్యాట్ ప్రొడక్ట్స్ అండ్ పౌడర్
మ్యాట్ ప్రొడక్ట్స్ పొడి చర్మం ఉన్నవారికి అస్సలు వర్కౌట్ అవ్వవు. కాబట్టి ఒక నిర్దిష్ట వయసు తర్వాత సెట్టింగ్ పౌడర్ బదులు మంచి సెట్టింగ్స్ స్ప్రే వాడండి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు