Charmy Kaur: పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసి షాక్ ఇచ్చిన ఛార్మీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి అందరిని తన వైపు తిప్పుకుంది అందాల ముద్దుగుమ్మ ఛార్మీ.. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి నిర్మాతగా పలు చిత్రాలకు వ్యవహరిస్తోంది. ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు సరసన నటించడం జరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పూరీ జగన్నాథ్, ఛార్మీ మధ్య ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి.

ఇటీవల కాలంలో లైగర్ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకోవడం జరిగింది ఛార్మీ. ఇలా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. ఛార్మీ పెళ్లి కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈమె వివాహం చేసుకోకపోవడానికి ఎన్నో రకాల వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి.. ముఖ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తో ఈమె రిలేషన్ లో ఉందంటూ కూడా పలు రకాల రూమర్స్ వినిపించాయి. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనుకుంటున్న సమయంలో బ్రేకప్ వార్తలు కూడా వైరల్ గా మారాయి.

అయితే ఆ తర్వాత ఈమె పూరీ జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలు చేయడం మొదలుపెట్టి ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగి ప్రస్తుతం ముంబైలో ఇద్దరు ఉంటున్నట్లుగా సమాచారం. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు పలు రకాల రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. తాజాగా ఛార్మి తన పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా తెలియజేసింది.. తనకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అని తెలియజేయడం జరిగింది.

- Advertisement -

అప్పట్లో ఆయనకు పెళ్లి జరిగిందని తెలిసి చాలా బాధపడ్డాను అని తెలియజేసింది ఛార్మి.. ప్రస్తుతం హృతిక్ రోషన్ సింగల్ గా ఉంటున్నారు.. ఇప్పుడు ఆయన మరొకసారి పెళ్లి చేసుకుంటేనే తాను పెళ్లి చేసుకుంటానని తెలియజేసింది ఛార్మి. తన పెళ్లి మొత్తం హృతిక్ రోషన్ తో ముడిపడి ఉందంటూ ఛార్మి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన పలువురు అభిమానులు, నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి వచ్చే ఏడాదైన పెళ్లి విషయం పైన గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు