Trisha: ఆమెకి అన్యాయం చేయాలనుకున్న త్రిష.. చివరికి..!

ప్రముఖ కోలీవుడ్ బ్యూటీ త్రిష గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. గత 21 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా తన మేని అందంతో యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరి ముఖ్యంగా ఈమె అందాలకు బానిసవ్వని కుర్రాళ్ళు లేరు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే త్రిష అందానికి కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు హీరోలు కూడా బానిసలు అవుతారు. అలా ఇప్పటికే చాలామంది హీరోలతో ఈమె రిలేషన్ కూడా నడిపింది. అందులో భాగంగానే కోలీవుడ్ హీరో విజయ్, ధనుష్ తో పాటు తెలుగులో ప్రభాస్, రానా ఇలా ఎంతోమందితో ప్రేమాయణం నడిపిన ఈమె ఒకరితో కూడా పెళ్లి పీటలు ఎక్కలేదు.

చివరికి బిజినెస్ మాన్ అయిన వరుణ్ మానియన్ తో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అది పెళ్లి వరకు వెళ్లకుండానే మధ్యలోనే ఆగిపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే త్రిష పెళ్లి చేసుకోవాలనుకున్న వరుణ్ మానియన్ తన తోటి హీరోయిన్ లవర్ అని తెలుస్తోంది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రాఘవ లారెన్స్ సినిమా కాంచనలో హీరోయిన్ గా చేసిన లక్ష్మీరాయ్.. ఐటమ్ సాంగ్స్ చేస్తూ హీరోయిన్గా కూడా ఒక మోస్తారు గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీరాయ్ ముందుగా వరుణ్ మానియన్ తో ప్రేమలో పడిందట. ఇక ఒక ప్రైవేట్ పార్టీలో కలిసిన వీరిద్దరూ ప్రేమలో ఉండగా అప్పటికే అవకాశాలు లేని లక్ష్మీరాయ్కి అజిత్ హీరోగా వచ్చిన మంగతా సినిమాలో వరుణ్ అవకాశం ఇప్పించినట్లు సమాచారం. అలా ఆ సినిమాలో అజిత్ హీరోగా చేస్తే త్రిష మొదటి హీరోయిన్గా, లక్ష్మీ రాయ్ సెకండ్ హీరోయిన్గా చేశారు.

ఈ సినిమాలో నటించేటప్పుడు లక్ష్మీ రాయ్ కి త్రిష కి మధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. అలా ఇద్దరు పబ్ లకు, పార్టీలకు వెళ్లే వారట. మరొకవైపు లక్ష్మీరాయ్ తన బాయ్ ఫ్రెండ్ అయినా వరుణ్ ని వెంటపెట్టుకొని తీసుకురావడంతో త్రిషకి , వరుణ్ కి మధ్య రిలేషన్ ఏర్పడి లక్ష్మీరాయ్ ని పక్కన పెట్టి.. త్రిష, వరుణ్ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీరాయ్ ఇద్దరినీ హెచ్చరించినా వినలేదట. దీంతో ఆమె తప్పుకుంది .అలా లక్ష్మీ రాయ్ కి త్రిష అన్యాయం చేసినట్లు సమాచారం. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా కర్మ వెంటాడుతుంది అనడానికి ఇదే నిదర్శనం.. అలా వీరిద్దరూ కూడా పెళ్లి కాకుండానే విడిపోయారు.

- Advertisement -

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు