సమంత, ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్రహీరోయిన్ గా కొనసాగుతున్నారు. చైతూకు విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి సమంత క్రేజ్ మరింత పెరిగింది. బాలీవుడ్ సినిమాలు, ఐటెం సాంగ్స్ చేసుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంది సమంత. విమర్శకులకు తన స్టైల్ లోనే ఆన్సర్స్ ఇస్తూ, దూసుకుపోతోంది. సామ్ తాజాగా కాఫీ విత్ కరణ్ షో కు గెస్ట్ గా వెళ్లింది. అక్షయ్ కుమార్, కరణ్ జోహార్ లతో సందడి చేసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో అక్షయ్ కుమార్ తో కలిసి, సమంత స్టెప్పులు వేసింది.
సమంతను అక్షయ్ కుమార్ ఎత్తుకుని రావడం ఈ షోకు హైలెట్ నిలించింది. ఇక ఈ తరుణంలోనే కరణ్, సమంతను ఓ ప్రశ్న అడిగేశాడు. ‘మీ బెస్ట్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో మీరు డాన్స్ చేయాల్సి వస్తే, ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలతో చేస్తారు’ అని అడుగగా టక్కున రణవీర్ సింగ్, రణవీర్ సింగ్ అంటూ రెండు సార్లు అతని పేరే చెప్పేసింది సమంత. ఇక ఈ సమాధానాన్ని ఊహించలేని అక్షయ్ కుమార్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించాడు.
అయితే, బాలీవుడ్ లో పెళ్లి కాని హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ, సమంత రణవీర్ సింగ్ పేరునే రెండు సార్లు చెప్పింది. రణ్ వీర్ సింగ్ పై మనసు పారేసుకుందని, అందుకే రణ్ వీర్ సింగ్ పేరు చెప్పి ఉంటుందని కొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయపడుతున్నారు. కాగా, చైతూతో విడాకులపై ఈ ఫుల్ ఎపిసోడ్ లో నైనా సమంత క్లారిటీ ఇస్తుందో ? లేదో చూడాలి.