Prabhu: కూతురికి కట్నంగా ప్రభు ఎంత ఇచ్చారో తెలుసా..?

సౌత్ ఇండియాలో గొప్ప నటుడుగా పేరుపొందిన ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్లో, టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇటీవలే కొద్ది రోజుల క్రితం ప్రభు.. తన కూతురు ఐశ్వర్య వివాహాన్ని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో చాలా గ్రాండ్ గా వివాహం చేయించారు. అయితే ప్రభు కూతురికి గతంలో వివాహం కావడం.. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకొని కొద్ది రోజులపాటు తల్లిదండ్రుల వద్ద ఉండేది.

అయితే దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ను రెండో వివాహం చేసుకోవడం జరిగింది. 2015 వ సంవత్సరంలో త్రిష , నయనతార నటించిన ఒక మూవీ ద్వారా పరిచయమయ్యారు అధిక్ రవిచంద్రన్.. ఇటీవలే విశాల్ తో కలిసి తెరకెక్కించిన మార్క్ ఆంటోనీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఎస్ జె సూర్య కూడా కీలకమైన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు . విశాల్ మొదటిసారిగా రూ.100 కోట్ల మార్కెట్ ను అందుకోవడం జరిగింది.

ఇకపోతే కోలీవుడ్లో టాప్ హీరో అజిత్ నటిస్తున్న ఒక చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభు కుమార్తె ఐశ్వర్య ను వివాహం చేసుకోవడం జరిగింది. చెన్నైలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి డైరెక్టర్ మణిరత్నం సుహాసిని, ఖుష్బూ, రజనీకాంత్ ,విశాల్ ,దుల్కర్ సల్మాన్, శరవణన్ తదితరులు సైతం వీరి వివాహానికి హాజరయ్యారు. గతంలో ఐశ్వర్య కు వివాహం అయ్యింది ఎవరితో కాదు ప్రభు సోదరి కుమారుడితో వివాహమైంది. అతను లండన్ లో సాఫ్ట్వేర్ గా పనిచేసే వారట.

- Advertisement -

అలా లండన్ లో ఉన్న వీరి మధ్య హఠాత్తుగా భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక విడాకుల తర్వాత చెన్నైకి తిరిగి వచ్చిన ఐశ్వర్య కేకులు తయారు చేసే వ్యాపారాన్ని మొదలుపెట్టిందట. అలా Meltz dessertz అనే కంపెనీని కూడా నడుపుతోంది. ఈ సమయంలోనే డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో స్నేహబంధం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఇరువురు కుటుంబ సభ్యులు కూడా వీరి వివాహానికి అంగీకరించారు.

ప్రభు తన కూతురు కట్నం కింద 1 kg బంగారం తో పాటు చెన్నైలో విలాసవంతమైన ఒక బంగ్లా, 4 కోట్ల రూపాయల కట్నం ఇచ్చినట్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అయితే ఐశ్వర్య ప్రస్తుత వయసు 34 ఏళ్లు కాగా డైరెక్టర్ వయసు 32 ఏళ్ళు..

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు