Devara : “గుంటూరు కారం” మూవీతోనే మాస్ ఫీస్ట్… తారక్ ఫ్యాన్స్ గెట్ రెడీ

“దేవర” ఫ్యాన్స్ గెట్ రెడీ… ఈ సంక్రాంతి పక్కా మీదే. “గుంటూరు కారం” మూవీతోనే తారక్ మాస్ ఫీస్ట్ ఉండబోతోంది. తాజాగా ఫిలిం సర్కిల్స్ నుంచి తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఒకటి అందింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? తారక్ ఫ్యాన్స్ లో జోష్ నింపే ఆ మాస్ ఫీస్ట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ “దేవర”. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. క్రేజీ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో తారక్ తో ఫైట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైపోయింది. ఇక ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా, ఈ సినిమా గురించి బయటకు వస్తున్న రోజుకొక రూమర్ “దేవర” మూవీపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. “ఆర్ఆర్ఆర్” తర్వాత తారక్ నుంచి ఇప్పటిదాకా మరో సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆయన అభిమానులు బాగా ఆకలి మీద ఉన్నారు. “దేవర”కు సంబంధించిన అప్డేట్లు ఎప్పుడు బయటకు వస్తాయా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ అప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ రోజుకొక పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సంక్రాంతికి తారక్ అభిమానులకు మాస్ ఫీస్ట్ ఉండబోతుందని, మేకర్స్ చేస్తున్న ప్లాన్ అభిమానులను ఆనందంలో ముంచబోతోంది అని సమాచారం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే… “దేవర” గ్లిమ్స్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం” సినిమా థియేటర్లకు అటాచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఒక్క “గుంటూరు కారం” మూవీ మాత్రమే కాదు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాల స్క్రీన్ లలోను “దేవర” గ్లిమ్స్ స్క్రీనింగ్ కాబోతుందట. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే ఈ సంక్రాంతి పక్కా తారక్ ఫాన్స్ దే అవుతుంది. ఇక గతంలో కూడా “సలార్” మూవీ స్క్రీన్ కి “దేవర” టీజర్ ను అటాచ్ చేయబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాను ఊపేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం “దేవర” మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. లేట్ గానే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ, అనుకుంటున్నట్టుగా పక్కా ప్లాన్ ప్రకారం, సైలెంట్ గా “దేవర” షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు టీం.

- Advertisement -

ఇక “గుంటూరు కారం” సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా, “గుంటూరు కారం” సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న బిగ్ స్క్రీన్ పై స్పందన చేయబోతోంది.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు