Salaar Trailer: ట్రైలర్ ఉందా లేదా? మాకేంటసలు ఈ టార్చర్?

“సలార్” రిలీజ్ ట్రైలర్ ఈ రోజు రేపు అంటూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మూడుసార్లు “సలార్” సెకండ్ ట్రైలర్ పోస్ట్ పోన్ కావడంతో డార్లింగ్ ఫాన్స్ చిత్ర నిర్మాతలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ట్రైలర్ ఉందా లేదా? మాకు ఏంటి అసలు ఈ టార్చర్? అంటూ సోషల్ మీడియా వేదికగా “సలార్” మేకర్స్ ని నిలదీస్తున్నారు.

ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 22న ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా, సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చూపిస్తున్న అలసత్వంపై డార్లింగ్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక రీసెంట్ గా సలార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి మరో ట్రైలర్ ఉండబోతుందని ప్రచారం నడిచింది. అనుకుంటున్నట్టుగానే “సలార్” రిలీజ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నామంటూ చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో అసలే ఆకలి మీద ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతిసారి వాళ్లకు నిరాశే ఎదురవుతుంది. చిత్ర బృందం ఇప్పటికే మూడుసార్లు ఈ ట్రైలర్ ను వాయిదా వేసింది.

- Advertisement -

ఆదివారం రోజు సలార్ “ట్రైలర్” రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. అది కాస్తా వాయిదా పడింది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సండే ట్రైలర్ కోసం ఎదురు చూస్తుంటే చడి చప్పుడు చేయకుండా సైలెంట్ అయిపోయారు మేకర్స్. అనంతరం ముందుగా ప్రకటించినదాని ప్రకారం టీం “సలార్” రిలీజ్ ట్రైలర్ ఈరోజు ఉదయం 10: 45 గంటలకు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సలార్ ట్రైలర్ రాబోతోందని రెడీగా ఉండాలంటూ ఫ్యాన్స్ ను అలర్ట్ చేశారు.

తీరా చూస్తే సమయం గడిచిపోయినప్పటికీ ట్రైలర్ ను రిలీజ్ చేయలేదు. దీంతో నిర్మాతల తీరుతో విసుగెత్తిపోయిన నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా “సలార్” నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ను ఏకిపారేస్తున్నారు. టీజర్ ను ఎప్పుడో ఎవడు లేవకముందే ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్లో ప్రభాస్ ను అతి తక్కువ షాట్స్ లో చూపిస్తూ ఫ్లాట్ ఏంటో రివీల్ చేసేసారు. సినిమా నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక సాంగ్ రిలీజ్ చేశారు అది కూడా ఒక రోజు ముందు అనౌన్స్మెంట్ ఇచ్చి.

ఇప్పటిదాకా సాంగ్స్ లేవు, ప్రమోషన్స్ లేవు, కనీసం ఒక మెయిన్ ఈవెంట్ లేదు. అయినప్పటికీ సలార్ రిలీజ్ ట్రైలర్ మూడుసార్లు ఎలా డిలీట్ అయింది? అంటూ నిర్మాతలను ఆడేసుకుంటున్నారు. ఇంతకీ “సలార్” ట్రైలర్ ను రిలీజ్ చేస్తారా? లేదంటే ఆడియన్స్ ఎమోషన్స్ తో ఇలాగే ఆడుకుంటారా?

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు