Salaar Trailer Talk: స్నేహితులే శత్రువులైతే… అదే సలార్ కథా

ఎంత భారీ సినిమాకైనా, ఎంత ప్రెస్టీజియస్ మూవీకైనా హ్యూమన్ ఎమోషన్స్ ఒక బేస్ మెంట్ లాంటివి. ఇంటర్ స్టెల్లర్ లాంటి హాలీవుడ్ క్లాసిక్ లోనూ తండ్రీ కూతురు మధ్య భావోద్వేగాలను, ప్రేమను చూపించారు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. తెలుగు సినిమా ప్రైడ్ అని పిలుచుకునే బాహుబలిలోనూ తల్లి కొడుకు మధ్య ఎమోషన్స్ కథకు మూలం. మేకింగ్ లో ఎన్ని హంగులు చూపించినా ఈ కోర్ ఎలిమెంట్స్ లేకుంటే అవన్నీ వృథానే.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన కేజీఎఫ్ మూవీస్ లోనూ ఇదే రూట్ ఫాలో అయ్యాడు. మదర్ సెంటిమెంట్, పేద కొడుకు, గొప్ప ధనవంతుడిగా తన జీవితాన్ని సాగించాలని కోరుకునే తల్లి ఆరాటాన్ని చూపిస్తూ కథను హీరోయిజం ఎలివేషన్స్ తో నడిపించాడు. ఇప్పుడు సలార్ లోనూ ప్రశాంత్ నీల్ అదే ఫార్ములా కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది.

వరదరాజ మన్నార్, దేవ అనే ఇద్దరు స్నేహితుల మధ్య కథను సలార్ గా మలిచినట్లు ఫైనల్ ట్రైలర్ తో తెలుస్తోంది. ప్రేమ తర్వాత అంతటి భావోద్వేగం ఉండేది స్నేహం విషయంలోనే. అందుకే ఈసారి స్నేహాన్ని తన సినిమాకు వస్తువుగా ఎంచుకున్నాడు. స్నేహితుల్లో ఇద్దరి మధ్య ప్రేమ స్వచ్ఛంగా ఉంటే ఓకే గానీ ఒకరు స్వార్థంగా మరొకరు నిస్వార్థంగా ఉంటే ఆ స్నేహం మోసానికే దారి తీస్తుంది. సలార్ ఫైనల్ ట్రైలర్ లో వాడొక పిచ్చివాడు అంటూ తన స్వార్థానికి దేవను వరదరాజ మన్నార్ వాడుకోవాలని చూసినట్లు వెల్లడించారు.

- Advertisement -

అంటే స్నేహానికి ప్రాణమిచ్చే ప్రభాస్ క్యారెక్టర్ ను వరద క్యారెక్టర్ ఎలా మోసం చేసింది అనేది ఒక హింట్ అనుకోవచ్చు. ఇక స్నేహితుడి కోసం హీరో చేసే ప్రాణాంతక పోరాటం, అబ్బురపరిచే సాహసాలన్నీ పాజిటివ్ కోణంలోనే ప్రేక్షకులు చూస్తారు. హీరో ఏం చేసినా దానికో పర్పస్ ఉంటుంది. పర్పస్ ఉన్నప్పుడు కథకు కనెక్ట్ అవుతారు. ఇలా సలార్ ఫైనల్ ట్రైలర్ లో ఒక మీనింగ్ ఫుల్ సినిమా చూడబోతున్నట్లు సిగ్నల్స్ పంపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు