Venkatesh Maha: మహా మళ్ళీ మళ్ళీ అదే తప్పు

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్ మహా. మొదటి సినిమాతోనే మంచి పేరును సాధించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో చాలామంది నటులను పరిచయం చేశాడు వెంకటేష్ మహా. అయితే కేరాఫ్ కంచరపాలెం సినిమా తో ఒక కొత్త ప్రపంచాన్ని అధ్భుతంగా వెండితెరపై చూపించాడు వెంకటేష్ మహా
ఆ సినిమా తర్వాత వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన మహేషింటే ప్రతీకార సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.

ఈ సినిమా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని వెంకటేష్ మహాకు అందించింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు వెంకటేష్ మహా నుంచి ఒక సినిమా కూడా దర్శకుడుగా బయటకు రాలేదు. కానీ వెంకటేష్ మహా కొన్ని సినిమాల్లో నటుడుగా మాత్రం మంచి పాత్రలను పోషించాడు. ప్రస్తుతం వెంకటేష్ మహా “మర్మానువు” అని ఒక క్రౌడ్ ఫండ్ సినిమాను తీస్తున్నాడు. అయితే వెంకటేష్ మహా సినిమాలకంటే కూడా కాంట్రవర్సీలో ఎక్కువగా వినిపిస్తుంటాడు.

ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో చాలామంది డైరెక్టర్ తో పాటు కూర్చున్న వెంకటేష్ మహా, కెజిఎఫ్ సినిమా పైన చేసిన కామెంట్స్ వెంకటేష్ మహా పైన చాలా ట్రోల్స్ ను తీసుకొచ్చాయి. ఇప్పటికి వెంకటేష్ మహ చేసిన కామెంట్స్ వలన ఇప్పటికి చాలామంది ట్రోల్ చేస్తారు. అంతా కూల్ అయిపోయింది అనుకున్న తరుణంలో వెంకటేష్ కొత్త వివాదానికి దారి తీసాడు. కావాలనే ట్రోలర్స్ కి ఒక కంటెంట్ ను అందించాడు. ప్రస్తుతం సలార్ సినిమా వైబ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందరు ఆ సినిమా కోసం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందంటూ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఈ తరుణంలో రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన డంకి సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే డంకి సినిమాకి టికెట్లు బుక్ చేసుకున్నట్టు వెంకటేష్ మహా ఒక స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. సలార్ ఫీవర్ నడుస్తున్న సమయంలో ఇలా డంకీ సినిమా ప్రమోట్ చేయడంతో చాలామంది వెంకటేష్ మహా పైన ట్రోల్స్ మొదలుపెట్టారు. మొత్తానికి మహా చేసిన కామెంట్స్ వలన తనకొచ్చిన చెడ్డ పేరు మెల్లగా మర్చిపోతున్నారు అనుకున్న టైంలో మహా మళ్లీమళ్లీ అదే తప్పు చేస్తూ ట్రోలర్స్ ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు