Mahesh Babu: గుంటూరు కారం బీట్ సాంగ్ లీక్… కావాలనే లీక్ చేస్తున్నారా?

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం అనే సినిమా వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి అయింది. ఫైనల్ గా ఓ సాంగ్ షూట్ ను రేపటి నుంచి స్టార్ట్ చేయనున్నారు. దాన్ని త్వరగా పూర్తి చేసి ఇప్పటికే స్టార్ట్ చేసిన పోస్ట్ ప్రొడక్షన్ పనులపైన త్రివిక్రమ్ ఫోకస్ చేయనున్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుంచి లీక్స్ వస్తూనే ఉన్నాయి. షూటింగ్ లోకేషన్స్ లో మెయిన్ కాస్ట్ ఫోటోల నుంచి లీక్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా సినిమాలోని సాంగ్స్ బయటికి వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే దమ్ మసాలా సాంగ్ మొత్తం విడుదల చేయడానికి ముందే బయటికి వచ్చింది. సాంగ్ లీక్ కావడంతో ఏదో ఫార్మాలిటీగా సాంగ్ రిలీజ్ చేశారు. తర్వాత కూడా ఏదో ఒక సాంగ్ నుంచి లీక్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం నుంచి మరో సాంగ్ లీక్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల మధ్య ఓ బీట్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ లోని నుంచి కొన్ని సన్నివేశాలు అంటూ ఓ వీడియో బయటికి వచ్చింది.

ఈ వీడియోలో హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ చేస్తున్నారు. 20 సెకండ్స్ వరకు ఉన్న ఈ వీడియోలో శ్రీలీల మాస్ గా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా, గుంటూరు కారం నుంచి ఈ లీక్స్ ఎలా బయటికి వస్తున్నాయి? ఎవరు లీక్ చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ ను అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. అయితే సినిమా యూనిట్ లోనే ఉండే క్రూ మెంబర్స్ లో ఒకరు ఈ లీక్స్ చేస్తున్నారని డౌట్ వస్తుంది. మరి ఎవరా క్రూ మెంబర్ ? సినిమా టీం మరి ఇంత సైలెంట్ గా ఎందుకు ఉంటుంది? రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని, సినిమాపై హైప్ పెంచడానికి డైరెక్టర్, నిర్మాతలే లీక్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

- Advertisement -

కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు ఈ లీక్ లు ఉండటం కొత్తేమీ కాదు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు లీక్ సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు