Decoit: స్టోరీ లైన్ ఇదే… నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

డైనమిక్ హీరో అడవి శేష్ లేటెస్ట్ మూవీ “డెకాయిట్”. ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్టును శేష్ ఎక్స్ శృతి అంటూ రిలీజ్ చేసి అందరిని అట్రాక్ట్ చేశారు. ఆ తర్వాత వరుసగా విడుదలైన శేష్ ఫస్ట్ లుక్ పోస్టర్, శృతిహాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మూవీ పై ఒక్కసారిగా అంచనాలను క్రియేట్ చేశాయి. షానియేల్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది.  ఇక డిసెంబర్ 20న ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేస్తూ ఆసక్తికరమైన టీజర్ ను వదిలారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండగా, స్టొరీ బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుందా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

జూలియట్ ఎన్నేళ్లు అయింది మనం కలిసి అనే డైలాగ్ తో అడవి శేషు ఇంట్రెస్టింగ్ ఎంట్రీ, ఆ తర్వాత అల్లర్లు జరిగిన ఓ ప్రాంతంలో శృతిహాసన్ తుపాకీ పట్టుకొని కనిపించడం చూస్తుంటే వీళ్ళిద్దరూ గతంలో ప్రేమికులని, ఆ తర్వాత విడిపోయారు అనే విషయం అర్థం అవుతుంది. ఇక ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు తుపాకీలు ఎక్కువ పెట్టుకుని ఫైర్ చేసినట్టుగా, కింద పడిపోయినట్టుగా సౌండ్ రావడంతో “డెకాయిట్”పై సస్పెన్స్ నెలకొంది. ఇక టీజర్ లో ఆసక్తికరంగా అనిపించిన మరో విషయం బిజియం. బీమ్స్ సిసిరోలియో అందించిన బిజిఎం అదిరిపోయింది అని చెప్పాలి. ఇదంతా సరే అసలు “డెకాయిట్” స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటి అనే విషయంలోకి వెళ్తే, ఆంధ్ర, కర్ణాటక బార్డర్ ప్రాంతంలో జరిగే అల్లర్లు, వాటి మధ్య అప్పటికే ప్రేమించుకుని విడిపోయిన ఇద్దరు మాజీ లవర్స్ తమ జీవితాలను మార్చుకోవడానికి కలిసి చేసే దోపిడీనే ఈ “డెకాయిట్” అని అంచనా వేస్తున్నారు సిని విశ్లేషకులు. మరి వారి అంచనా ఎంతవరకు నిజం అవుతుంది అనే విషయం తెలియాలంటే “డెకాయిట్” ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. కానీ ఏదైతేనేం ఒక చిన్న టీజర్ తోనే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఆ విజువల్స్ హాలీవుడ్ మూవీని పోలి హైరేంజ్ లో కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ ఫుల్ అయింది.

- Advertisement -

ఇక ప్రస్తుతం శృతిహాసన్ “సలార్” మూవీతో మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. మరోవైపు అడివి శేష్ “గూడచారి 2” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే అడివి శేష్ ఖాతాలో “హిట్” సీక్వెల్ కూడా ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు అడవి శేషు ఖాతాలో లేటెస్ట్ మూవీ “డెకాయిట్” గురించి కూడా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు