సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి నటీనటుల మధ్య మంచి స్నేహబంధం ఉంటుందని ఎన్నో సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు నటీనటులు. అయితే మా హీరో గొప్ప.. మా హీరో గొప్ప అంటూ ఎన్నో సందర్భాలలో అభిమానుల మధ్య గొడవలు కూడా జరగడం మనం చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా ఈమధ్య కాలంలో ఒక హీరో సినిమాలకు మరొకరు సహాయం చేస్తూ అంతా కలిసికట్టుగా ఉంటున్నారు.అలా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలు కూడా ఉన్నారు.
వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా.. స్టార్ హీరోలుగా ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. వాస్తవానికి నాగార్జున , బాలయ్య ఇద్దరు కూడా మంచి మిత్రులే.. అయినప్పటికీ వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా సరే నాగార్జున , బాలకృష్ణ ఒకే చోట మాత్రం అసలు కనిపించడం లేదు.. ముఖ్యంగా నాగార్జునకు సంబంధించి ఎలాంటి వేడుకలకు సైతం బాలయ్య హాజరుకారు.. అలాగే బాలకృష్ణ వేడుకలకు కూడా నాగార్జున దూరంగానే ఉంటారు.
ఇలా నాగార్జున , బాలకృష్ణ మధ్య మాటలు లేకపోవడానికి అసలు విషయం ఏంటనే విషయంపై ఎంతోమంది అభిమానులకు సందేహాన్ని కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలోని ఇప్పుడు ఒక వార్త వినిపిస్తోంది. అదేమిటంటే సీనియర్ ఎన్టీఆర్ వల్లే బాలకృష్ణతో నాగార్జున అసలు మాట్లాడడం లేదనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే సీనియర్ ఎన్టీఆర్ కారణంగానే బాలకృష్ణ ను దూరం పెట్టారని సమాచారం.. అయితే బాలయ్యను దూరం పెట్టే అంత తప్పు ఎన్టీఆర్ ఏం చేశారనే విషయానికి వస్తే..
సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగార్జున నటించిన ఒక సినిమా భారీ విజయాన్ని అందుకున్నదట.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వాలని చిత్ర బృందం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని కలిసి ఈ విషయం గురించి మాట్లాడారట. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్.. నాగార్జున నటించిన ఆ చిత్రాన్ని జాతీయ అవార్డుల జ్యూరీ కి పంపలేదని సమాచారం.
ఈ విషయాన్ని అక్కినేని కుటుంబం తెలుసుకొని నాగార్జున నటించిన ఒక గొప్ప సినిమా అవార్డు అందుకోలేక పోయిందని.. ఈ విధంగా ఎన్టీఆర్ తమ సినిమా విషయంలో వ్యవహరించిన తీరు వారికి చాలా బాధ కలిగించిందని.. ఆ కారణంగానే నాగర్జున బాలయ్యతో కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదని సమాచారం.. సీనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాని జ్యూరీకి పంపకపోవడానికి కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య ఉన్న గొడవే కారణమని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.