Bigg Boss: పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాగార్జున..!

Bigg Boss:  బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి సీజన్-7 వరకు పలు రకాల ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి.. అయినప్పటికీ బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ బిగ్ బాస్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇటీవలే బిగ్ బాస్-7 కి సంబంధించి గ్రాండ్ ఫినాలే అన్నపూర్ణ స్టూడియో వద్ద చాలా గ్రాండ్ గా జరిగింది.. ఇక్కడ కామన్ మాన్ కేటగిరిలో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా సీరియల్ నటుడు అమర్ దీప్ రన్నర్ గా నిలిచారు. దీంతో ప్రశాంత్ అభిమానులు అమర్ దీప్ పై హౌస్ లో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని..దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ జరిగిన దాడిలో ప్రశాంత్ (బిగ్బాస్ విన్నర్) అరెస్ట్ అయ్యారు. ఇది కాస్తా ఇప్పుడు ఒక సంచలన వార్తగా మారింది.

ఇక బిగ్ బాస్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టు కావడంతో నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న తీరు పైన తీవ్రమైన ప్రభావం పడింది.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ జైలుకు వెళ్లడంతో ఇప్పుడు ఈ విషయం మీద ఇప్పటివరకు బిగ్ బాస్ యాజమాన్యం కానీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా ఏ విధంగా స్పందించలేదు. దాంతో వీరి పైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఫలితంగా నాగార్జున ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 17వ తేదీన ఫినాలే ముగిసింది. అయితే విన్నర్ ఎవరనే విషయం కూడా ముందుగానే లీక్ అయ్యింది. కామన్ మ్యాన్ గా రైతుబిడ్డగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ అభిమానులు విన్నర్ తనే అని తెలుసుకొని అన్నపూర్ణ స్టూడియో వద్దకి భారీగా చేరుకున్నారు. అయితే ఇక్కడ అమర్ ఫాన్స్ , ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. దీంతో పలు రకాల ప్రైవేట్ ఆస్తులపైన తీవ్ర నష్టాన్ని చూపించారు.

- Advertisement -

దీంతో ప్రశాంత్ అభిమానులను అరెస్టు చేసిన పోలీసులు చివరికి ప్రశాంత్ ని కూడా నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లడంతోపాటు 14 రోజులు రిమాండ్ విధించాలని తెలియజేశారు. అయితే షరతుల తో కూడిన బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. బిగ్ బాస్ సీజన్-3 నుంచి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఈ వివాదంలోకి మళ్లీ లాగారు.. బిగ్బాస్ నిర్వహకుల పైన కేసు పెట్టాలంటూ చాలామంది హైకోర్టులో మానవ హక్కుల కమిషన్ కింద కంప్లైంట్ చేశారు.

దీంతో నాగార్జున విమర్శలు ఎదుర్కోవడంతో ఆయన ఇమేజ్ మరింత డ్యామేజ్ అయింది.. అందుకే నాగార్జున నెక్స్ట్ సీజన్ కి హోస్టుగా చేయకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నాగార్జున కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే సీజన్ 8 కి ఎవరు హోస్ట్ గా వస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు