Sreeleela in 2023 : ఈ ఏడాది అన్ లక్కీ హీరోయిన్ శ్రీలీలే !

Sreeleela in 2023 :టాలీవుడ్ లో అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువ. వారిలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల ఇంకా ప్రత్యేకం. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతోంది శ్రీలీల. అయితే ఈ ఏడాది శ్రీలీలకు అస్సలు కలిసి రాలేదు అని చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందని భావించిన అందరికీ షాక్ ఇస్తూ అన్ లక్కీ హీరోయిన్ గా నిలిచింది. మరి 2023లో శ్రీలీల కెరియర్ గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం.

2023లో బహుశా శ్రీలీలకు వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కు రాలేదని చెప్పాలి. ఈ బ్యూటీ ఒక్క ఏడాదిలోనే దాదాపు 4 సినిమాల్లో కనిపించి తనకంటూ ఓ ప్రత్యేకమైన రికార్డును క్రియేట్ చేసుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాలోని ఈ బ్యూటీ అందం, చలాకీ తనానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఈ ఏడాది మాస్ మహారాజా రవితేజ సరసన ‘ధమకా’ సినిమాలో హీరోయిన్ గా నటించి, ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ హిట్ కావడానికి శ్రీలీల కూడా ఓ ప్రధాన కారణం.

“ధమాకా” మూవీ సాంగ్స్ లో శ్రీలీల చేసిన డాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక అందం, అభినయానికి తోడు అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఉన్న శ్రీలీల టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకోవడం ఖాయం అని అంతా భావించారు. అనుకున్నట్టుగానే ధమాకా మూవీతో ఈ బ్యూటీ ఖాతాలో ఫస్ట్ హిట్ పడింది. ఇక శ్రీలీలకు తిరుగులేదు అనుకుంటున్న తరుణంలోనే “స్కంద” మూవీతో ఊహించని ప్లాఫ్ అందుకుంది. రామ్ పోతినేని హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన “స్కంద” మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీ నుంచి శ్రీలీల దురదృష్టం స్టార్ట్ అయింది.

- Advertisement -

“స్కంద” తర్వాత శ్రీలీల నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఒక్క “భగవంత్ కేసరి” మూవీ తప్ప. కానీ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల హీరోయిన్ కాదు. బాలయ్య హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇందులో హీరోయిన్ కంటే శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక శ్రీలీల నటన కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తర్వాత శ్రీ లీల హీరోయిన్గా నటించిన “ఆదికేశవ”, “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి.

ఈ ఏడాది శ్రీలీల ఏకంగా నాలుగు సినిమాలు చేసి రికార్డును క్రియేట్ చేసింది. కానీ అందులో ఈ బ్యూటీ ఓకే ఒక్క హిట్ అందుకుంది. దీంతో శ్రీలీల స్పీడ్ కు బ్రేకులు పడ్డట్టుగా అయింది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను శాసిస్తుంది అని భావించిన శ్రీలీల ఓకే ఏడాదిలో ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. దీంతో శ్రీలీల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తోందని, అందుకే మూవీలో తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ లేకపోయినా నటించడానికి ఒప్పుకుంటుంది అని కామెంట్స్ వినిపించాయి.

దీంతో ఆమె నెక్స్ట్ మూవీ ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం మహేష్ బాబుకి జోడిగా “గుంటూరు కారం” సినిమాలో, పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలు చేస్తోంది. “గుంటూరు కారం” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు శ్రీలీల ఆశలన్నీ “గుంటూరు కారం” మూవీ పైనే ఉన్నాయి. ఇలా వరుస డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుని 2023లోనే అన్ లక్కీ హీరోయిన్ గా మిగిలిపోయింది శ్రీలీల.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు