Guntur Kaaram: ఒక్క ప్రోమోతో డౌట్స్ అన్నీ క్లియర్… మిగతా సినిమాల ముఖ చిత్రం ఏంటో?

Guntur Kaaram: “గుంటూరు కారం” మూవీ నుంచి తాజాగా విడుదల చేసిన “కుర్చీని మడత పెట్టి” సాంగ్ ప్రోమో ఇప్పటిదాకా మూవీపై నెలకొన్న అన్ని డౌట్స్ ని క్లియర్ చేసింది. మరి ఈ సంక్రాంతికి “గుంటూరు కారం” మూవీకి పోటీగా రాబోతున్న ఇతర చిత్రాల ముఖచిత్రం ఏంటో ఇప్పుడు!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” మూవీతో పాటు విక్టరీ వెంకటేష్ “సైంధవ్”, రవితేజ లేటెస్ట్ మూవీ “ఈగల్”, కింగ్ నాగార్జున “నా సామి రంగ”, తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “హనుమాన్” 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు “గుంటూరు కారం” మూవీ హిట్ అవుతుందా, లేదంటే యావరేజ్ గా నిలుస్తుందా అనే డౌట్ ఉండేది. దానికి కారణం ఇటీవల కాలంలో “గుంటూరు కారం” మూవీపై వచ్చిన తీవ్రమైన నెగెటివిటీ. అలాగే ఈ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు రాబోతుండడం.

రీసెంట్ గా రిలీజ్ అయిన “ఓ మై బేబీ” అనే సాంగ్ విషయంలో “గుంటూరు కారం” మూవీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇక ఆ సాంగ్ ఇచ్చిన కాన్ఫిడెన్సా ఏమో తెలీదు గానీ ఆ తర్వాత వరుసగా సంక్రాంతికి రాబోయే సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి. సంక్రాంతి రేసులో నుంచి ఒకటి రెండు సినిమాలను తప్పించడానికి ట్రై చేసినా నిర్మాతలు ససేమిరా తమ సినిమాలను వాయిదా వేసుకోవడానికి ఒప్పుకోలేదు.

- Advertisement -

ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఏకంగా రెండుసార్లు సంక్రాంతి సినిమాల నిర్మాతలను పిలిచి మీటింగ్ పెట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలింది. ఇక ఇలాగైతే కష్టమని భావించిన దిల్ రాజు ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకున్న సినిమాలకు ఆ తర్వాత సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ప్రకటించినా ఆ బంపర్ ఆఫర్ ను తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇక ముందుగా అనుకుంటున్నాటుగానే సంక్రాంతి సినిమాలన్నీ అదే డేట్లలో రిలీజ్ కాబోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా “గుంటూరు కారం” మూవీ నుంచి రిలీజ్ అయిన “కుర్చీ మడత పెట్టి” అనే అదిరిపోయే మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో మహేష్ బాబు వేసిన మాస్ స్టెప్పులు, ఆయన ఎనర్జీ, డాన్స్ క్వీన్ శ్రీలీల గ్రేస్ చూస్తే ఈ సంక్రాంతికి రాబోయే సినిమాల్లో బాక్సాఫీస్ కింగ్ అయ్యేది “గుంటూరు కారం” అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది.

కేవలం ఈ ఒక్క ప్రోమో సాంగ్ ఇప్పటిదాకా ఈ సినిమాపై నెలకొన్న పలు అనుమానాలను క్లియర్ చేసేసింది. ఇక ఈ సాంగ్ చూసిన మిగతా సినిమాల మేకర్స్ కొంతైనా ఆలోచనలో పడే ఉంటారు. కానీ ఇప్పుడు చేసేదేం లేదు కాబట్టి సంక్రాంతి రేసులో నిలబడి, తమ కంటెంట్ బాగా లేకపోతే ప్రేక్షకుల తిరస్కరణకు గురై చేతులు కాల్చుకోవడమే మిగిలింది. కాగా “కుర్చీ మడత పెట్టి” ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతోంది. ఈ సాంగ్ గనుక న్యూ ఇయర్ లో మోత మోగింది అంటే ఇక సంక్రాంతి రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు