Naga Shaurya: పెళ్లయిన ఏడాదికే వేరే కాపురం.. శౌర్య నువ్వు చేసిన పనేం బాలేదబ్బాయ్..!

Naga Shaurya:  సాధారణంగా ఎక్కడైనా సరే అబ్బాయిలైనా అమ్మాయిలు అయినా పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్లి తర్వాత మాత్రం ఖచ్చితంగా మారతారు అన్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా అబ్బాయిలు పెళ్లయిన తర్వాత అత్తా కోడళ్ళ మధ్య ఇరుక్కున్నాడు అంటే.. అతని పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఈ కాలం యువత ఎక్కువగా అత్తమామలకు దూరంగా ఉండాలని తమకంటూ ఒక ప్రైవసీ కావాలని స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటున్నారు. అందుకే బంధాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పెద్దవారు కూడా అర్థం చేసుకొని వారికి ప్రైవసీని కల్పిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా హీరో నాగ శౌర్య కూడా తన కుటుంబం నుంచి స్వేచ్ఛ కోరుకున్నారో ఏమో తెలియదు కానీ పెళ్లయిన ఏడాదికే వేరే కాపురం పెట్టారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ విషయంపై హీరో నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి మాట్లాడుతూ.. తన కొడుకు నాగశౌర్య వేరే కాపురం పెట్టడంపై స్పందించారు. నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కి అందించారు ఆమె. అంతేకాదు మరొకవైపు ఉషా మల్పూరి అనే పేరుతో ఒక రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేసి మంచి క్వాలిటీ ఫుడ్ ని కూడా అందిస్తున్నారు. ఇకపోతే నాగశౌర్య గత ఏడాది కర్ణాటక కు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం చేసుకున్నారు. బెంగళూరులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లి తర్వాత నాగశౌర్య వేరే కాపురం పెట్టాడు అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఉషా మల్పూరి మాట్లాడుతూ.. అనూషా చాలా మంచి అమ్మాయి.. ఆమె నాకు మూడేళ్ల క్రితం నుంచే తెలుసు.. శౌర్యకి పర్ఫెక్ట్ జోడి అని.. నా కోడలిగా కాకుండా కూతురి లా రావాలని కోరుకున్నాను.. తాను కూడా మమ్మల్ని మమ్మా డాడీ అని పిలుస్తుంది. నా పెద్ద కోడలు అమెరికాలో ఉంది.. అక్కడే ఆపిల్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.. అనూష ఇంటీరియర్ డిజైనర్ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని మరీ ఆఫీస్ కి వెళ్తుంది.. చాలా మెచ్యూర్ ఉన్న అమ్మాయి.. పెళ్లయిన కొద్ది రోజులకే వాళ్ళు వేరే కాపురం పెట్టారు.. ఇలాగే ఉండాలి అని పెళ్లికి ముందే చెప్పుకున్నాము.. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే ప్రేమలు పెరుగుతాయని అనుకున్నాము.. ఇక ఈ విషయం ఇప్పుడు అనుకున్నది కాదు పిల్లలు పుట్టినప్పుడు, పెరిగినప్పుడే అలా దూరంగా ఉండాలని అనుకున్నాను.

- Advertisement -

సాధారణంగా ఈ జనరేషన్ లో పిల్లలు ఫ్రీడం కావాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే మా పిల్లలకు కూడా మేము స్వేచ్ఛ ఇచ్చాము.. ఇందులో అంతగా ఆలోచించడానికి ఏమీ లేదు అంటూ ప్రస్తుతం జనరేషన్ ని దృష్టిలో పెట్టుకొని కామెంట్లు చేశారు ఉషా మల్పూరి. ఇకపోతే ఈ కామెంట్స్ పై నెటిజెన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు