Prashant Neel: సొంత ఇంటినే అమ్ముకున్న ప్రశాంత్ నీల్.. కారణం..?

Prashant Neel: కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమను పాన్ ఇండియాకు పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేసి ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాని శాసిస్తున్న డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈయన చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ కావడమే కాదు ఈయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును కూడా అందించాయి.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఎవరైనా సక్సెస్ కావాలని అడుగు పెడతారు.. కానీ ఈయన మాత్రం డబ్బు అవసరం ఉండి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారట. అయితే ఆ తర్వాత కాలంలో సినిమాల మీద ఆసక్తి పెరిగి డైరెక్టర్ గా మారారు.

ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఉగ్రం. ఇందులో హీరోగా నటించిన శ్రీమురళి తనకు బందువట. ప్రశాంత్ నీల్ చెల్లెలిని శ్రీ మురళి వివాహం చేసుకున్నారు. అందుకే ప్రశాంత్ తన మొదటి సినిమాను శ్రీ మురళితో చేయవలసి వచ్చింది. ఇకపోతే ప్రశాంత్ నీల్ కర్ణాటక కు చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా వాళ్ల పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని మడకశిర దగ్గరలో ఉన్న నీలకంఠాపురం వాసులట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కూడా ప్రశాంత్ నిల్ కి బంధువులు ఉన్నారు. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి స్వయాన వాళ్ళ చిన్నాన్న అవుతారట. అలాగే ప్రముఖ నటుడు వీ.కే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కూడా ఈయనకు చెల్లెలు అవుతుందని సమాచారం.

ఇకపోతే సలార్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ తన సొంత ఇంటిని అమ్ముకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే ఉగ్రం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ఆ సినిమా కోసం తన ఇంటిని కూడా అమ్మేశారట. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే అంత ధైర్యం చేసి ఇంటిని అమ్మారట. అయితే ఆయన అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ లభించింది. ఏది ఏమైనా తనమీద తనకున్న నమ్మకంతోనే తన సొంత ఇంటిని అమ్ముకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు భారీ క్రేజ్ దక్కించుకున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు