Chiranjeevi: చిరంజీవి వల్ల నేను నష్టపోయా.. బన్నీ కామెంట్స్ వైరల్..!!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్వయంకృషితో పైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మెగాస్టార్ తర్వాత ఆ ఫ్యామిలీ నుండి దాదాపు అరడజను మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలామంది ఇండస్ట్రీలోకి ప్రవేశించి టాలెంట్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ వీరిలో అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి కారణంగా డబ్బులు నష్టపోయారట. అదెలా అని ఆలోచిస్తున్నారా..? ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే బన్నీ డబ్బులు పోగొట్టుకుంది మెగాస్టార్ డాన్స్ కారణంగా అని చెప్పి షాక్ ఇచ్చారు. చిరు డాన్స్ గురించి, ఆయన బాడీలో ఉన్న గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంద్ర సినిమా సమయంలో బన్నీకి, తన ఫ్రెండ్ కి మధ్య ఓ చిన్న చర్చ జరిగిందట.

“దాయి దాయి దామా” పాటలో చిరంజీవి వీన స్టెప్ వేసేటప్పుడు ఆయన పక్కన సోనాలి బింద్రే ఉందని.. లేదని బన్నీ ఇద్దరు వాదించుకున్నారట. బన్నీ ఇంద్ర సినిమా 17 సార్లు చూశారట. అందులో బాస్ సోలోగానే స్టెప్ వేశారని మొండిగా వాదించారట. అంతేకాదు ఈ పాయింట్ పై 25 వేలు బెట్ కూడా కట్టారట. కానీ ఆఖరికి వీడియో చూస్తే చిరూ పక్కన సోనాలి బింద్రే కూడా స్టెప్ వేసింది. అప్పుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి నువ్వు చెప్పిందే నిజమని.. కానీ పక్కన హీరోయిన్ ఉన్నా.. ఆమె వైపు కంటి చూపు కూడా వెళ్లకుండా చిరంజీవి గారి డాన్స్ మాత్రమే చూసేలా చేశారని చెప్పారట. అలా మెగాస్టార్ కారణంగా అల్లు అర్జున్ పాతికవేల రూపాయలు నష్టపోయారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు