Sankranthi Race: నాగ్ రేపైనా కన్ఫర్మ్ చేస్తాడా?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి భారీ సినిమాలు రాబోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సినిమాలు పొంగల్ బరిలో నిలవగా, పలు డబ్బింగ్ సినిమాలు కూడా రేసులో నిలవాలని చూస్తున్నాయి. ఇక తెలుగు నుండి మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్ తో పాటు మీడియం రేంజ్ సినిమా హనుమాన్ కూడా ఫిక్స్ అయ్యాయి. అయితే సంక్రాంతి రేసు లో ఉన్నామని చాలా రోజుల నుండి చెప్పుకొస్తున్న నా సామి రంగ మాత్రం ఇప్పటివరకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.

అయితే తాజాగా నాగార్జున సంక్రాంతి సీజన్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేడని సమాచారం. ఎందుకంటే లాస్ట్ టైం నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన, ఇంకా బంగార్రాజు తో పొంగల్ కి మంచి హిట్లు కొట్టగా, అంతకు ముందు కూడా నాగార్జున ఖాతాలో పలు పొంగల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఇక గత ఏడాదిన్నర గా అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన ఏ సినిమా కూడా ఆడలేదు. అందుకే ఈ సారి పొంగల్ సెంటిమెంట్ తో అయినా హిట్ వస్తుదేమో అని అనుకుంటున్నారట.

కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే థియేటర్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మిగతా నాలుగు సినిమాలు కూడా పొంగల్ కి ఫిక్స్ అయ్యాయని తెలిసింది. అయితే నా సామి రంగ పొంగల్ బరిలో ఉన్నా పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. అయితే న్యూ ఇయర్ స్పెషల్ గా నా సామి రంగ నుండి టైటిల్ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసినపుడు నా సామి రంగ సంక్రాంతి బరిలో ఉన్నాడో లేదు కన్ఫర్మేషన్ ఇచ్చే చాన్సు ఉంది. మరి టైటిల్ సాంగ్ రిలీజ్ తో నా సామి రంగ షాక్ ఇస్తాడా? కిక్కిస్తాడా అనేది చూడాలి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు