Guntur Kaaram : జస్ట్ యావరేజ్… ప్రింట్ కూడా రాకముందే టాక్

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం” రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. సినిమా రిలీజ్ కు ఇంకా 12 రోజులు ఉన్నప్పటికీ, అప్పుడే ఈ మూవీ యావరేజ్ అంటూ టాక్ నడుస్తోంది. ప్రింట్ కూడా రాకముందే “గుంటూరు కారం” మూవీ స్టోరీ బయటకు వచ్చేసింది. దీంతో సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇంతకీ “గుంటూరు కారం” మూవీ స్టోరీ ఏంటి అంటే…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, యంగ్ హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న తాజా మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో “గుంటూరు కారం” మూవీ స్టోరీ లీక్ అయ్యింది. ఇక స్టోరీ విషయానికి వస్తే… గుంటూరులో జరుగుతున్న అక్రమ కార్యక్రమాలను బట్టబయలు చేసేందుకు పని చేస్తున్న జర్నలిస్ట్ పాత్రలో శ్రీలీల కనిపించబోతోందని, ఇక ఆ జర్నలిస్టుతో ప్రేమలో పడిన అండర్ వరల్డ్ కింగ్ గా మహేష్ బాబు పాత్ర ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.

ఇక ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో మదర్ సెంటిమెంట్, మాస్ ఫైట్స్, రీమిక్స్ సర్ప్రైజ్ హైలెట్ గా నిలవబోతున్నాయి అని సమాచారం. రీమిక్స్ విషయానికి వస్తే పాపులర్ సాంగ్ “నాది నక్కిలీసు గొలుసు” మహేష్ బాబు స్టైల్ లో ఉండబోతుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే “గుంటూరు కారం” మూవీ ఫస్టాఫ్ యావరేజ్ గా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు కనీసం ప్రింట్ కూడా ఇంకా బయటకు రాలేదు అప్పుడే మొదలు పెట్టేశారు అంటూ మండిపడుతున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే మరోవైపు “గుంటూరు కారం” నుంచి రిలీజ్ అవుతున్న సాంగ్స్ వరుసగా కాంట్రవర్సీలకు తెరతీస్తున్నాయి. ఇదివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన “ఓ మై బేబీ” సాంగ్, ఇప్పుడేమో “కుర్చీ మడత పెట్టి” అనే సాంగ్ వివాదానికి కారణం అయ్యాయి. కానీ మరోవైపు “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ను మహేష్ అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ పాటను కాపీ కొట్టాడు అంటూ తమన్ ను ఏకిపారేస్తున్నారు.

పైగా ఆయన ఎక్కడెక్కడ ఆ సాంగ్ ను ఎలా కాపీ కొట్టాడు అనే విషయాన్ని డీటెయిల్ గా సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. మరి ఈ నెగెటివిటీ సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ కు దారి తీస్తుందో తెలియడం లేదు. కానీ ఫస్ట్ డే “గుంటూరు కారం” మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది అంతే మాత్రం ఈ సంక్రాంతి మహేష్ బాబుదే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు