Sreeleela: రమణ గాడి లవర్ స్ట్రాటజీ మార్చబోతోందా?

Sreeleela: గత ఏడాది వరుస సినిమాలు చేసిన హాట్ అండ్ బ్యూటిఫుల్ శ్రీలీల కెరీర్ కు ఒక స్పీడ్ బ్రేక్ పడింది. టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ చూసి 2023లో వరుస ఆఫర్లు ఇచ్చారు మేకర్స్. ఈ అమ్మడిని చూసి ఇతర హీరోయిన్లు కుళ్ళుకొనే రేంజ్ లో గత ఏడాది ఏకంగా మూడు నాలుగు సినిమాలు చేసేసింది. కానీ అందులో ఎక్కువగా ప్లాఫ్లే ఉండడంతో ఇప్పుడు ఈ బ్యూటీ దూకుడుకు అడ్డుకట్ట పడింది. వరుస సినిమాలతో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరగడంతో బాగానే ఎంజాయ్ చేసింది శ్రీలీల. అయితే వరుస ప్లాప్ లు ఎదురైనప్పటికీ గ్లామర్ పరంగా, డాన్స్ పరంగా శ్రీలీల సత్తా చాటింది. కానీ గతేడాదిలాగా ఇప్పుడు ఆమె చేతిలో వరుస సినిమాలో లేవు.

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ బుక్ కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2024లో ఇదే ఆమె మొదటి చిత్రం కాబోతోంది. దీంతో శ్రీ లీల ఈ మూవీ పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. కానీ సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్లు కేవలం గ్లామర్ కు మాత్రమే అంకితం అయిపోతారు.

డాన్స్, కేవలం రొమాన్స్ తప్ప హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. మరోవైపు శ్రీలీల కెరీర్లో “గుంటూరు కారం” మూవీ హిట్ కావడం చాలా కీలకం. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆమె మరింత ఉత్సాహంతో స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని టాలీవుడ్ లో పదిలం చేసుకునే అవకాశం ఉంది. లేదంటే గతంలో ఉప్పెనలా వచ్చి, తిరిగి సముద్రంలో కలిసిపోయిన అలలా శ్రీలీల కెరియర్ ఎలా మారిందో శ్రీలీల కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కోక తప్పదు.

- Advertisement -

ప్రస్తుతం శ్రీలీల “గుంటూరు కారం” మూవీ మాత్రమే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే “విజయ్ దేవరకొండ 12” మూవీకి కూడా సైన్ చేసింది. కానీ ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలు ఎప్పుడు రీస్టార్ట్ అవుతాయి అనే విషయంపై కనీసం క్లారిటీ లేనేలేదు. ప్రస్తుతం ఇవి తప్ప శ్రీలీల చేతిలో మరో కొత్త సినిమా లేదు.

దీంతో పరుగులు పెడుతున్న శ్రీలీల కెరీర్ కు ఒక్కసారిగా బ్రేక్ పడినట్టుగా అయ్యింది. ఈ నేపథ్యంలోనే శ్రీలీల తన స్ట్రాటజీని మార్చబోతోంది అని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు విడుదలై, ఫలితం చూసాకే మరొక సినిమా ఒప్పుకోవాలని నిర్ణయించుకుందట శ్రీలీల. మరోవైపు ఆమెకు మెడిసిన్ చివరి ఏడాది కావడంతో చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. కాబట్టి ఈ ఏడాది శ్రీలీల చాలా తక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు