Guntur Kaaram : పాన్ ఇండియా మూవీ రేంజ్ లో బిజినెస్… ముందే లాభాలు

Guntur Kaaram : సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “గుంటూరు కారం” మూవీ రిలీజ్ కాకముందే నిర్మాతల జేబుల్లోకి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ డిజిటల్, థియేట్రికల్ బిజినెస్ పాన్ ఇండియా మూవీ రేంజ్ లో జరిగినట్టు సమాచారం. మరి “గుంటూరు కారం” మూవీ డిజిటల్ రైట్స్ ను ఏ ఓటిటి సంస్థ సొంతం చేసుకుంది? అనే వివరాల్లోకి వెళితే…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. ఈ మూవీలో మహేష్ బాబుతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల, హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి రొమాన్స్ చేయబోతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రాబోతోంది. ఇక “గుంటూరు కారం” త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా రిలీజ్ కు రెండు వారాలు ఉండగానే “గుంటూరు కారం” మూవీ ఓటిటి, థియేట్రికల్ రైట్స్ తో పాటు సాటిలైట్ బిజినెస్ కూడా ఫాన్సీ డీల్ కు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మూవీ కావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం మూవీ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల వరకు జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

ఇక ఓవర్సీస్ డీల్ 40 కోట్లు కాగా, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం 160 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో “సలార్” మూవీ 160 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఇప్పుడు “గుంటూరు కారం” మూవీ రైట్స్ 120 కోట్ల వరకు అమ్ముడయ్యాయి అంటూ వస్తున్న వార్తలు చూసి మహేష్ మేనియా పాన్ ఇండియా స్టార్ రేంజ్ లో ఉందా అని? షాక్ అవుతున్నారు.

ఇక “గుంటూరు కారం” మూవీ సాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే స్టార్ మా ఫాన్సీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు “గుంటూరు కారం” డిజిటల్ రైట్స్ ను పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్
దాదాపు 50 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ కోసం పలు ఓటిటి ప్లాట్ఫార్మ్ లు పోటీ పడగా, చివరకు 50 కోట్ల రికార్డు ధరకు నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను చేజెక్కించుకున్నట్టు సమాచారం. కాగా ఇటీవల “గుంటూరు కారం” మూవీ షూటింగ్ ను పూర్తి చేసిన మహేష్ బాబు న్యూ ఇయర్ ట్రిప్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. జనవరి 5 నుంచి “గుంటూరు కారం” మూవీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయబోతున్నాడు మహేష్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు