Guntur kaaram: సలార్ బాటలో గుంటూరు కారం.. వర్కౌట్ అవుతుందా..?

Guntur kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ చేపట్టాల్సి ఉంది.. పైగా జనవరి 6వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు మేకర్స్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు పూర్తిగా అభిమానులను నిరాశలో ముంచేశారనే చెప్పాలి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేయగా.. భద్రతా కారణాలవల్ల ఈ వేడుకను క్యాన్సిల్ చేస్తున్నామని.. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని మేకర్స్ కూడా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపకుండా కేవలం మీడియా ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

జనవరి 10వ తేదీన మహేష్ బాబు మీడియా ముందుకు రాబోతున్నారని.. అందులో కేవలం మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే గుంటూరు కారం సినిమా ప్రభాస్ సలార్ మూవీని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభాస్ సలార్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతగా ఎదురు చూశారో అందరికీ తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి కూడా ఎటువంటి ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండా నేరుగానే సినిమాని రిలీజ్ చేశారు.

ఇందుకు కారణం ఆల్రెడీ రెండుసార్లు సినిమా విడుదల తేదీ వాయిదా పడిన నేపథ్యంలో.. అభిమానులను నిరాశ పరచకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఈ కారణాల వల్లే సమయం లేకపోవడం వల్ల నో ప్రమోషన్స్ స్ట్రాటజీ ని ఫాలో అవుతూ సినిమాను నేరుగా విడుదల చేయడం జరిగింది. నిజానికీ ఈ సినిమా గ్రాఫిక్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో రాజీ పడకూడదన్న నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నీల్ ఇలా ఎటువంటి ప్రమోషన్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్లను జరపకుండా నేరుగా సినిమాను విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

- Advertisement -

ఇప్పుడు ఇదే బాటలో మహేష్ బాబు గుంటూరు కారం కూడా నడుస్తోంది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన సినిమా ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా.. మళ్లీ ప్రమోషన్స్ అంటూ డిస్టర్బ్ అయితే అనుకున్న సమయానికి సినిమాను థియేటర్లలోకి తీసుకురాలేమన్న కారణంతో ఇప్పుడు ఈ సినిమాకి కూడా ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరపకుండానే నేరుగా జనవరి 12వ తేదీన విడుదల చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. మరి సలార్ సినిమాకి వర్కౌట్ అయిన ఈ స్ట్రాటజీ గుంటూరు కారం సినిమాకి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు